శనగపిండి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. శనగపిండి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. శనగపిండిని ఉపయోగించి చాలా రకాల వంటలు స్వీట్లు కూడా తయారు చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా శనగపిండిని అందం కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అందాన్ని మరింత పెంచుకోవడం కోసం చర్మ సమస్యలను తగ్గించుకోవడం కోసం ఉపయోగిస్తూ ఉంటారు. చాలా తక్కువ మంది మాత్రమే శనగపిండిని చర్మానికి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఎప్పటినుంచో శనగపిండిని చర్మాన్ని శుభ్రం చేయడం కోసం ఉపయోగిస్తూనే ఉన్నారు. ఈ పిండితో తయారు చేసిన ఫేస్ ప్యాక్ ను అందాన్ని మెరుగుపర్చడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫ్యాక్ ముఖంపై మొటిమలను, మచ్చలను పోగొట్టడానికి బాగా పనిచేస్తుందట. అలాగే ఇది ముఖం అందంగా మెరిసేలా కూడా చేస్తుందట. అయితే ఇందుకోసం శెనగపిండిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
శనగపిండితో ముఖాన్ని శుభ్రం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ముఖంపై మురికి, దుమ్ము, ధూళిని తొలగించడంతో పాటు అదనపు ఆయిల్ ను తొలగించడానికి, వివిధ చర్మశుద్ది సమస్యలను వదిలించుకోవడానికి బాగా సహాయపడుతుందట. శనగపిండిని, పెరుగును కలిపి వాడితే ముఖం అందంగా మారుతుందట. అలాగే మీ ముఖం కూడా కాంతివంతంగా మారాలంటే శనగపిండిలో పెరుగును కలిపి ముఖానికి అప్లై చేయాలట. ఈ ఫేస్ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల మొటిమలు, బ్లాక్ హెడ్స్, మచ్చలు తగ్గుతాయని చెబుతున్నారు. అయితే ఇంతకీ ఈ శనగపిండి ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి అన్న విషయానికి వస్తే.. 2 నుంచి 3 టీస్పూన్ల శనగపిండిని తీసుకుని దానిలో 2 టీస్పూన్ల పెరుగును వేసి కలపాలి.
ఈ ప్యాక్ లో తేనె, పసుపు వేసి అన్నింటినీ బాగా కలపాలి. దీన్ని మీ ముఖానికి అప్లై చేయాలి. ఈ శనగపిండి, పెరుగు ఫేస్ ప్యాక్ ను వారానికి 1లేదా 2 సార్లు అప్లై చేయడం వల్ల మీ ముఖం కాంతివంతంగా మారుతుందట. అదేవిధంగా మీ ముఖ చర్మం ప్రకాశవంతంగా, మృదువుగా ఉండటానికి శనగపిండిలో పచ్చి పాలను కలిపి వాడితే మంచి ప్రయోజనకరంగా ఉంటుందట. ఇది ముఖంపై ఉండే నల్ల, తెల్ల మచ్చలను పోగొట్టడానికి సహాయపడుతుందట. ఈ ప్యాక్ ను తయారు చేయడానికి 2 టీస్పూన్ల శెనగపిండిలో 3 నుంచి 4 టీ స్పూన్ల పచ్చి పాలను వేసి కలపాలి. దీనిలో కొద్దిగా రోజ్ వాటర్, అలోవెరా జెల్ ను కలపాలి. ఈ ఫేస్ ప్యాక్ ను మీ ముఖానికి, మెడ మొత్తానికి అప్లై చేయాలి. మంచి ఫలితాల కోసం ఈ ప్యాక్ ను వారానికి 1 నుంచి 2 సార్లు అప్లై చేయాలి.