Aloevera: నల్లటి వలయాలు తగ్గుముఖం పట్టాలంటే అలోవేరాతో ఇలా చేయాల్సిందే?

కలబంద వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కలబంద ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి ఎన్నో రకాల ప్రయో

  • Written By:
  • Updated On - February 20, 2024 / 09:29 PM IST

కలబంద వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కలబంద ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఎన్నో రకాల చర్మ సమస్యలను కలబంద దూరం చేస్తుంది. అలాగే తరచూ కలబందను ఉపయోగించడం వల్ల మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. అలోవెరా ఉపయోగించడం వల్ల చర్మం, జుట్టు కూడా ఎంతో అందంగా మారుతుంది. అలోవెరా జ్యూస్‌ని కూడా చాలా మంది తాగుతూ ఉంటారు. దీని వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు కలబందతో ఎన్నో ప్రయోజనాలు మనం పొందొచ్చు. ఇకపోతే రఈ రోజుల్లో అమ్మాయిలు,అబ్బాయిలు చాలా మంది
డార్క్ సర్కిల్స్‌తో ఇబ్బంది పడుతూ ఉంటారు.

మీరు కూడా డార్క్ సర్కిల్స్‌‌తో ఇబ్బంది పడుతున్నారా? అయితే తప్పకుండా కలబందని ఉపయోగించాల్సిందే. డార్క్ సర్కిల్స్ పోవాలంటే మీరు రాత్రి నిద్రపోయే ముందు కలబంద మట్ట తీసుకుని దాని నుండి గుజ్జు తీసి మీ డార్క్ సర్కిల్స్‌పైన అప్లై చేయాలి. అయితే ఇలా అప్లై చేసిన తర్వాత వెంటనే కడిగేసుకోకుండా రాత్రంతా అలానే వదిలేయాలి. ఆ తర్వాత ఉదయాన్నే వాష్ చేయాలి. ఇలా చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ మాయమైపోతాయి. కాబట్టి ఈ చిన్న చిట్కాని పాటిస్తే త్వరగా డార్క్ సర్కిల్స్ బాధ నుండి బయట పడిపోవచ్చు. అలోవెరాని ఉపయోగించడం వల్ల చర్మం అందంగా మారుతుంది. రంగు మారడానికి కూడా మీరు గమనించవచ్చు. అయితే దీని కోసం మీరు ఏం చేయాలంటే..? అలోవెరా గుజ్జు ముఖం మీద అప్లై చేయండి.

దీనితో మీ చర్మం కాస్త తెల్లగా మారుతుంది. దీని కోసం మీరు రాత్రి పూట కలబంద గుజ్జు రాసుకుని ఉదయం కడిగేసుకుంటే మంచిది. కనుక నిద్రపోయే ముందు కలబంద కొమ్మని తీసుకుని దానిలో నుండి గుజ్జు తీసేసి దానిని ముఖానికి అప్లై చేయాలి. రాత్రంతా అలానే వదిలేసి ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయాలి. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు వారానికి చేస్తూ ఉండటం వల్ల మీకు చక్కని పరిష్కారం కనబడుతుంది. అలోవెరా చర్మం పై ఉండే వృద్ధాప్య ఛాయలను పోగొడుతుంది. అయితే వయసు పైబడే వారు ఈ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. అలోవెరా చర్మానికి నిజంగా ఎంతో మేలు చేస్తుంది. అలోవెరాలో విటమిన్ సి విటమిన్ ఈ ఉంటాయి.