Beautiful Skin: ముఖానికి నిమ్మరసం పట్టించవచ్చా.. ఏవైనా సమస్యలు వస్తాయా?

మామూలుగా చాలామంది స్త్రీ పురుషులు మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రోడక్ట్ కి బదులు ఎక్కువగా హోం రెమిడీస్ ని ఫాలో అవుతూ ఉంటారు. ఇలా ఫాలో అవడం మంచ

  • Written By:
  • Publish Date - August 15, 2023 / 08:30 PM IST

మామూలుగా చాలామంది స్త్రీ పురుషులు మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రోడక్ట్ కి బదులు ఎక్కువగా హోం రెమిడీస్ ని ఫాలో అవుతూ ఉంటారు. ఇలా ఫాలో అవడం మంచిదే కానీ అలా అని ఏది పడితే అది ఉపయోగించడం వల్ల స్కిన్ మరింత డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే బ్యూటీ నిపుణులు ఏదైనా ట్రై చేసే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిదని చెబుతూ ఉంటారు. ఈ ఫేస్ మాస్క్ వేసుకునే సమయంలో చాలామంది నిమ్మకాయను నేరుగా స్కిన్ కి ఉపయోగిస్తూ ఉంటారు. మరి అలా నిమ్మకాయను ఉపయోగించవచ్చా లేదా అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నిమ్మ కాయలో విటమిన్ సి తో పాటు సిట్రిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారికి స్కిన్ ఇరిటేషన్‌ని కలుగచేస్తుంది. పైగా సన్ బర్న్ట్‌కి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దాల్చిన చెక్కలో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలా అని దీన్ని ఫేస్ మాస్కుల్లో వాడకూడదు. ఇది ఎర్రదనాన్ని, ఇరిటేషన్‌ని కలుగచేయవచ్చు. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారు దీనికి పూర్తిగా దూరంగా ఉండడం మంచిది. చాలా రకాల స్కిన్ కండిషన్స్‌కి ఈ మధ్య కాలంలో యాపిల్ సైడర్ వెనిగర్ ఒక పాపులర్ రెమెడీ అయిపోయింది. కానీ, ఈ వెనిగర్ బాగా ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. ఫలితంగా స్కిన్‌కి ఉండే సహజ రక్షణ కవచం డిస్టర్బ్ అవుతుంది. ఒక్కోసారి, ఈ వెనిగర్‌ని ఎక్కువగా కనుక వాడితే కెమికల్ బర్న్స్ ఏర్పడే ప్రమాదం కూడా ఉంది.

ఎప్పటి నుంచో ఈ వెజిటబుల్ ఆయిల్‌ని స్కిన్ కేర్‌లో వాడుతున్నారు. అయితే, ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం. అందరి స్కిన్ ఒకేలా ఉండదు. కాబట్టి ఒకరికి పడినవి ఇంకొకరికి పడకపోవచ్చు. పడని వారికి కాంటాక్ట్ డెర్మిటైటిస్, లిచినాయిడ్ డెర్మటైటిస్ వంటివి వచ్చే రిస్క్ ఉంది. ఇంట్లో ఏదైనా హోమ్ రెమెడీస్ ట్రై చేసే ముందు ఒకటికి రెండుసార్లు వాటి గురించి తెలుసుకోవడం మంచిది. అలాగే మనం వాడే రెమెడీస్ కి సరిపోతాయా లేదా అన్న విషయాలను కూడా గుర్తుంచుకోవడం తప్పనిసరి. లేదంటే స్కిన్ డ్యామేజ్ అయ్యి మరింత అంద విహీనంగా కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. నిమ్మరసం, చక్కెర మిశ్రమాన్ని కూడా మన ముఖానికి రాసుకోవచ్చు. దీన్ని తయారు చేయడానికి, ఒక చెంచా చక్కెర తీసుకొని అందులో అలోవెరా జెల్, నిమ్మరసం మిక్స్ చేయాలి. తర్వాత దానిని పేస్ట్‌లా చేసుకోవాలి. అనంతరం ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేయండి. 10 నిముషాలు పోయాక చేతులతో సున్నితంగా ముఖాన్ని స్క్రబ్ చేసి, శుభ్రమైన నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోతుంది.