Skin Care: చలికాలం మొదలయ్యింది అంటే చాలు చర్మ సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ చర్మ సమస్యల కారణంగా చాలామంది తన ఇబ్బంది పడుతూ ఉంటారు. చర్మం డ్రై గా అయిపోవడం, పెదాలు పొడి భారడం వంటి వాటితో బాధపడుతూ ఉంటారు. పొడిగాలి చర్మంలోని తేమను గ్రహించడం వల్ల స్కిన్ మెరుపు కోల్పోతుంది. దానివల్ల చర్మం పొడి బారుతుంది. ముఖ్యంగా పెదవులు, అరచేతులు, పాదాలపై పగుళ్లు ఏర్పడతాయట. చర్మంపై తెల్లటి మచ్చలు కనిపిస్తాయని, చర్మం పొడిగా, దురదగా, ఎర్రగా మారుతుందని చెబుతున్నారు. చల్లటి గాలి శరీరానికి, మనసుకు హాయినిస్తుందట.
అయితే చర్మ సమస్యలు చలికాలంలో అతి పెద్ద సమస్యగా మారుతూ ఉంటాయి. వింటర్ సీజన్ లో అనేక చర్మ సమస్యలు తలెత్తుతాయట. పొడిగాలి చర్మంలోని తేమను గ్రహించడం వల్ల స్కిన్ మెరుపు కోల్పోతుందట. చర్మం పొడిబారుతుందని, ముఖ్యంగా పెదవులు, అరచేతులు, పాదాలపై పగుళ్లు ఏర్పడతాయని, చర్మంపై తెల్లటి మచ్చలు కనిపిస్తాయని చెబుతున్నారు. చర్మం పొడిగా, దురదగా, ఎర్రగా మారుతుందని, కాబట్టి చలికాలంలో చర్మ సంరక్షణకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుందని చెబుతున్నారు. చలికాలంలో కొన్ని చిట్కాలు ఫాలో అయితే మీ చర్మం మెరుస్తూ ఉంటుందట.
చలికాలంలో ఎక్కువ నీరు తాగడం వల్ల మీరు హైడ్రేటెడ్‌గా ఉండవచ్చట. పగటిపూట నీరు పుష్కలంగా తాగినప్పుడు చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందట. చర్మ ఆరోగ్యానికి ముప్పు కలిగించే టాక్సిన్స్ తొలగిపోతాయని, చలికాలంలో చర్మాన్ని ఉంచేందుకు రోజూ నీరు, హెర్బల్ టీలను తీసుకోవచ్చని చెబుతున్నారు. చలికాలంలో చాలా మంది సన్‌స్క్రీన్ లను వాడరు. వాతావరణం చల్లగా ఉన్నా, సూర్యరశ్మి లేని సమయంలో కూడా UV కిరణాలు చర్మాన్ని తాకుతూనే ఉంటాయి. దీంతో చర్మ సమస్యలు ఎక్కువ అవుతాయి. వృద్ధాప్య ఛాయలు కూడా కనబడతాయి. చలికాలంలో చర్మానికి హైడ్రేటింగ్ లేదా క్రీమ్ క్లెన్సర్ ని అప్లై చేయాలట. ఇవి వాడటం వల్ల చర్మం దాని సహజ తేమను బయటకు పంపదని, ఇందులో ఉండే గ్లిజరిన్ లేదా సిరామైడ్ లు తేమను ఎక్కువసేపు ఉంచడంలో సహాయపడతాయని చెబుతున్నారు. హైలురోనిక్ యాసిడ్, షియా బటర్ లేదా స్క్వాలేన్ అధికంగా ఉన్న మాయిశ్చరైజర్లు చర్మానికి రాసుకోవాలట. ఇవి చర్మంలోకి లోతుగా చేరి తేమను అందించడంలో సహాయపడతాయట. అదేవిధంగా శీతాకాలంలో గాలి వాతావరణం చాలా పొడిగా ఉంటుంది. ఇది డ్రై స్కిన్ సమస్యకు దారితీస్తుందట.
మృత చర్మ కణాల పొరలను తొలగించడానికి చర్మాన్ని స్క్రబ్ చేయాలట. ఇది డెడ్ స్కిన్‌ను తొలగించడమే కాకుండా, మాయిశ్చరైజర్ లు చర్మంలోకి లోతుగా చేరడానికి కూడా సహాయపడుతుందని,కానీ చలికాలంలో స్క్రబ్ లను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఎందుకంటే అవి పొడి లేదా సున్నితమైన చర్మం వంటి చర్మ సమస్యలను పెంచుతాయట. లాక్టిక్ యాసిడ్ థెరపీ వంటి రసాయనాలు కలిగిన స్క్రబ్ వాడాలట. అవి సున్నితమైన లేదా మాయిశ్చరైజింగ్ స్క్రబ్ లు. ఇవి చర్మానికి హాని కలిగించవని చెబుతున్నారు. పెదవులు, పాదాలు, చేతులు చలికాలంలో పొడి చర్మ సమస్యలకు ఎక్కువగా గురవుతాయి. శీతాకాలంలో ఎక్కువగా పగుళ్లు ఏర్పడతాయి. ఇది నొప్పి, కొన్నిసార్లు రక్తస్రావం కూడా అవుతూ ఉంటుంది. కాబట్టి చలికాలంలో చర్మం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Skin Care: చలికాలంలో పగిలిన చర్మంతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు మీకోసమే!

Skin Care