Eye Care: సమ్మర్ లో కళ్ళు జాగ్రత్తగా ఉండాలంటే ఇలా చేయాల్సిందే?

వేసవికాలంలో చర్మం అందం, జుట్టు విషయంలోనే కాకుండా కళ్ల విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు వహించాలి. వేసవికాలంలో మధ్యాహ్నం సమయంలో బయటికి వె

  • Written By:
  • Publish Date - March 28, 2024 / 09:18 PM IST

వేసవికాలంలో చర్మం అందం, జుట్టు విషయంలోనే కాకుండా కళ్ల విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు వహించాలి. వేసవికాలంలో మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్లినప్పుడు తప్పకుండా కూలింగ్ గ్లాసెస్ ధరించడం మంచిది. కానీ చాలామంది ముఖ్యమైన కళ్ల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కానీ ఇక మీదట అలా అస్సలు చేయకండి. మరి సమ్మర్లో కళ్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేసవిలో వడగాలులు కళ్లపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. తీవ్రంగా నీరు కారడం, దురద పెట్టడం, ఎర్ర బారడం వంటి అలర్జీలు ఎక్కువవుతాయి.

ఒక్కోసారి రెటీనా, కంటి శుక్లం దెబ్బతినే పరిస్థితులు ఏర్పడతాయి. కళ్లపై ఒత్తిడి వంటి సీరియస్ సమస్యల వల్ల ఏకంగా కంటిచూపుపై ప్రభావం పడుతుంది. చివరికి చూపు కోల్పోయే ప్రమాదం తలెత్తుతుంది. సన్ గ్లాసెస్ హానికరమైన యూవీ కిరణాల నుంచి కళ్లను రక్షిస్తాయి. మంచి క్వాలిటీ ఉన్నవాటికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. స్విమ్మింగ్ చేసే సమయంలో కూడా స్విమ్మింగ్ గాగుల్స్ పెట్టుకోవాలి. దీనివల్ల ఫూల్ లో ఉండే క్రిములు, క్లోరిన్ నుంచి కంటిని రక్షిస్తాయి. స్విమ్మింగ్ ఫూల్ లో దిగేటప్పుడు కాంటాక్ట్ లెన్స్ ఉంటే వాటిని తీసేయాలి. లేదంటే నేరుగా కార్నియాపై ప్రభావం పడి చూపు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. కళ్లు ఎర్రబారిన, డిశ్ఛార్జి సమస్య ఉన్న వారు స్విమ్మింగ్ పూల్‌లోకి దిగకుండా ఉంటేనే మంచిది. డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలి.

ఎక్కువ సంఖ్యలో పానీయాలు తీసుకుంటుండాలి. తాజా పళ్లను, కూరగాయలను తినాలి. విటమిన్ ఏ, సి, ఈ కలిగిన ఫ్రూట్స్‌ తీసుకోవడంతోపాటు ప్రతిరోజు 7 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలి. దీనివల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. పొడి బారడం, ఎర్రబారడం, దురద వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. శరీరానికి, కళ్లకు క్రమంగా విశ్రాంతిని ఇస్తుండాలి. 8 గంటల గాఢ నిద్ర ఉండాలి. ఏసీల్లో పనిచేసే వారు, డిజిటల్ స్క్రీన్లను ఎక్కువ సేపు చూసేవారికి కళ్లు ఎప్పటికప్పుడు పొడిబారుతుంటాయి. తద్వారా దురద పెడతాయి. ఒక గంటలో కనీసం 5-10 నిమిషాల పాటు పనికి బ్రేక్ ఇచ్చి కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. అలాగే వేసవిలో మధ్యాహ్నం సమయంలో ప్రయాణాలు మానుకోవాలి. 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో సూర్యకిరణాల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వేడి ఎక్కువగా ఉండి చర్మం, కళ్లు దెబ్బతింటాయి. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే గొడుగుకానీ, టోపీకానీ తీసుకువెళ్లాలి. వేసవిలో చర్మాన్ని రక్షించుకునేందుకు ముఖంపై సన్ స్క్రీన్ లోషన్స్ రాస్తుంటారు. కళ్లకు దగ్గరగా రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కళ్లకు అంటితే ఎర్రగా మారి దురద వస్తుంది. కొన్నిరోజులపాటు ఈ సమస్య ఉంటుంది.