Storage of Rice and pulses : బియ్యం, పప్పుదినుసులు పురుగు పట్టకుండా ఉండడానికి చిట్కాలు..

ఇంట్లోకి బియ్యం(Rice), పప్పుదినుసులు(Pulses) మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాము. కానీ వాటికి అప్పుడప్పుడు పురుగులు పట్టడం జరుగుతుంది. ఇలా వానాకాలంలో(Rainy Season) ఎక్కువగా జరుగుతుంది.

  • Written By:
  • Publish Date - August 7, 2023 / 10:30 PM IST

ఇంట్లోకి బియ్యం(Rice), పప్పుదినుసులు(Pulses) మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాము. కానీ వాటికి అప్పుడప్పుడు పురుగులు పట్టడం జరుగుతుంది. ఇలా వానాకాలంలో(Rainy Season) ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి అవి పురుగు పట్టకుండా ఉండడానికి మనం కొన్ని చిట్కాలను పాటించి జాగ్రత్తగా ఉంచుకోవచ్చు.

* బియ్యం, పప్పుదినుసులు ఉన్న డబ్బాలో ఎండిన వేపాకులను ఉంచితే పురుగులు పట్టకుండా ఉంటాయి.
* వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా బియ్యం, పప్పుదినుసులు ఉన్న డబ్బాలో ఉంచితే వెల్లుల్లి వాసనకు పురుగులు పట్టకుండా ఉంటాయి.
* మూడు ఎండుమిర్చి ని డబ్బాలో ఉంచినా బియ్యం, పప్పు దినుసులు పురుగు పట్టకుండా ఉంటాయి.
* కొన్ని లవంగాలను ఒక కాటన్ క్లోత్ లో ఉంచి బియ్యం, పప్పు దినుసులు ఉన్న డబ్బాలో ఉంచితే పురుగులు పట్టకుండా ఉంటాయి.
* ఇంగువను ఒక కాటన్ క్లోత్ లో ఉంచితే పురుగులు పట్టకుండా ఉంటాయి.
* కాకరకాయ ముక్కలను ఎండబెట్టి వాటిని ఒక క్లోత్ లో ఉంచి దానిని బియ్యం, పప్పు దినుసులు ఉన్న డబ్బాలో ఉంచితే పురుగులు పట్టకుండా ఉంటాయి.
* సిలికా జెల్ తో నిండిన ప్యాకెట్లు ఉంచినా పురుగులు పట్టకుండా ఉంటాయి.
* కొన్ని వేపాకులను తీసుకొని కడిగి ఎండబెట్టి వాటిని పొడి చేసి కాటన్ క్లోత్ లో ఉంచి దానిని బియ్యం, పప్పుదినుసులు ఉన్న డబ్బాలో ఉంచితే పురుగులు పట్టకుండా ఉంటాయి.

ఇలాంటి చిట్కాలని పాటించి మన ఇంట్లో రోజువారీ వంటకు వాడుకునే వస్తువులని పురుగులు పట్టకుండా కాపాడుకోవచ్చు.

 

Also Read : Bad Breath: యాపిల్ తో నోటి దుర్వాసన సమస్యకు చెక్ పెట్టండిలా?