Mangoes : మామిడి పండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలి..

సమ్మర్ లో మామిడి పండ్లు పాడవకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు.

  • Written By:
  • Publish Date - April 30, 2023 / 10:00 PM IST

సమ్మర్(Summer) అనగానే అందరికి ముందు గుర్తొచ్చేది మామిడి పండ్లు(Mangoes). చిన్నా పెద్దా అని తేడా లేకుండా అంతా మామిడి పండ్లు తినడానికి ఆసక్తి చూపిస్తారు. ఇక కొంతమంది అయితే ఇవి మళ్ళీ మళ్ళీ రావు కదా అని ఎక్కువ పండ్లు కొని దాయాలనుకుంటారు. ఒకేసారి ఎక్కువ మామిడి పండ్లు కొనుక్కొని సమ్మర్ అంతా తినాలని చూస్తారు. కానీ అలా కొన్నప్పుడు చాలావరకు మామిడి పండ్లు పాడైపోతాయి.

అందుకే సమ్మర్ లో మామిడి పండ్లు పాడవకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు.

#ఒకేసారి ఎక్కువగా మామిడిపండ్లు కొనవద్దు. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కొనుక్కోవడం బెటర్. లేదా వారానికి సరిపడా కొనుక్కుంటే చాలు.
#మామిడిపండ్ల మీద నల్ల మచ్చలు, దెబ్బ తిన్నట్టు కనిపిస్తే వాటిని అస్సలు కొనుగోలు చేయకండి. అవి త్వరగా పాడైపోతాయి.
#అలాగే బాగా పండిన మామిడి పండ్లను కొనవద్దు. ఆ రోజు తింటాము అనుకుంటేనే బాగా పండిన మామిడి పండ్లను కొనాలి. లేదా కొంచెం గట్టిగా, పచ్చిగా ఉన్న పండ్లు అయితే కొన్న తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
#మామిడి పండ్లను ఫ్రిడ్జ్ లో అస్సలు పెట్టకూడదు. ఫ్రిడ్జ్ లో కంటే కూడా బయట ఉంచితేనే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అంతే కాక ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల మామిడి పండు రుచి కూడా పోతుంది.
#అలాగే మామిడి పండ్లను ప్లాస్టిక్ కవర్స్ లో దాయకుడదు. ఏదైనా పేపర్ లో చుట్టి ఉంచాలి. లేదా విడిగా ఒక బుట్టలో పెట్టి ఉంచాలి.
#మామిడి పండ్లను వేరే కూరగాయలు లేదా పండ్లతో కలిపి ఉంచకూడదు. దీనివల్ల త్వరగా మామిడి పండ్లు పాడవుతాయి.
#మామిడి పండ్లకు ఈగలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఇంట్లో ఈగలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈగలు రాకపోతే కూడా పండ్లు పాడవకుండా ఉంటాయి. మామిడి పండ్ల మీద ఈగలు వాడకుండా జాలి కప్పి ఉంచాలి.

ఈ జాగ్రత్తలు తీసుకొని సమ్మర్ లో మామిడి పండ్లను ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకొని హ్యాపీగా తినండి.

 

Also Read :    Pimples : మొటిమలను న్యాచురల్ గా తగ్గించుకోవాలా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..