Coriander : కొత్తిమీర అన్ని రకాల కూరలు, పచ్చడులు, చారు, రసం, సాంబార్, వేపుడు వంటి వాటిల్లో వాడతారు. అప్పుడే వాటికి మంచి రుచి వస్తుంది. అలాగే కొత్తిమీరతో పచ్చడి కూడా చేసుకుంటాము. కానీ కొత్తిమీర మనం తెచ్చుకున్న రెండు రోజులకు మించి ఉండదు. వాడిపోవడం లేదా పాడైపోవడం జరుగుతుంది. కానీ మనం కొత్తిమీరను 15 రోజుల పాటు నిలువ ఉంచవచ్చు.
దానికి ముందు మనం కొత్తిమీరను కొనేటప్పుడే అది కుళ్ళిపోకుండా మంచిగా ఉన్నది చూసుకోవాలి. కొత్తిమీరకు వేర్లు ఉన్నవి తీసుకోవాలి. అప్పుడు మనం కొత్తిమీరను ఎక్కువ రోజులు నిలువ ఉంచవచ్చు.
కొత్తిమీరను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. ఒక గాజు కంటైనర్ తీసుకొని దానిలో అడుగు భాగంలో నీరు పోయాలి. మిగతా భాగం అంతా పొడిగా ఉండేలా చూడాలి. అప్పుడు దానిలో కొత్తిమీరను పెట్టాలి కొత్తిమీర అడుగుభాగం నీటిలో మునిగేలా చూడాలి. పైన భాగానికి నీరు తగలకుండా ఉంచి గాజు సీసా కు మూత పెట్టాలి. ఇలా చేసినట్లైతే కొత్తిమీర 15 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది.
అలాగే కొత్తిమీరను శుభ్రంగా కడిగి ఆరబెట్టినా తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఒక కంటైనర్ లో పెట్టాలి. ఆ కంటైనర్ లో ఒక టిష్యూ పెట్టి ఫ్రిజ్ లో పెట్టాలి. ఇలా చేసినా కొత్తిమీర 15 రోజుల వరకు నిలువ ఉంటుంది. కాబట్టి కొత్తిమీరను మనం ఇంటిలో ఈ విధంగా ఎక్కువ రోజులు నిలువ ఉంచుకోవచ్చు.
Also Read : Rubyglow Pineapple: వామ్మో.. ఈ ఫైనాపిల్ ధరెంతో తెలుసా..?