Site icon HashtagU Telugu

Eggs Storage : గుడ్లు ఎక్కువ కాలం నిలువ ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

Pakistan Egg Prices

How to Storage Eggs for so Many Days in Home Tips

గుడ్లలో(Eggs) అన్ని రకాల ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయి. కాబట్టి గుడ్లు అందరూ తింటారు. అయితే మనం రోజూ వాడుకునేవే కదా అని ఒక్కసారిగా ఎక్కువ గుడ్లను తెచ్చుకుంటూ ఉంటాము. కానీ ఒక్కోసారి అవి తొందరగా పాడైపోతాయి. గుడ్లు ఎక్కువకాలం పాడవకుండా నిలువ ఉండాలంటే ఇంట్లోనే కొన్ని టిప్స్ పాటించొచ్చు. ముందు మనం తెచ్చిన గుడ్లు ఫ్రెష్ వా కాదా అనేది తెలుసుకోవాలి. గుడ్లను నీటితో నింపిన ఒక బౌల్ లో వేయాలి. ఆ గుడ్లు నీటిలో మునిగితే తాజావని, తేలితే ఆ గుడ్లు ఫ్రెష్ వి కావు అని తెలుసుకోవచ్చు.

గుడ్లను ఫ్రిజ్(Fridge) లో మధ్య రాక్ లో పెట్టాలి అప్పుడే గుడ్లు పాడవకుండా ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి. గుడ్లను ఫ్రిజ్ డోర్స్ వద్ద అసలు పెట్టకూడదు. గుడ్లను ఫ్రిజ్ లో పెట్టకుండా ఎక్కువకాలం నిలువ ఉంచాలి అనుకుంటే జ్యూట్ బ్యాగ్ లు లేదా మట్టి కుండలలో పెట్టవచ్చు. గుడ్లను జ్యూట్ బ్యాగ్ లో ఉంచి డబ్బాలలో పెడితే ఎక్కువకాలం నిలువ ఉంటాయి. గుడ్లను ఎండుగడ్డి మధ్యలో ఉంచినా ఎక్కువరోజులు పాడవకుండా ఉంటాయి.

గుడ్ల పైన మినరల్ ఆయిల్ రాసి దానిని ఎండలో ఉంచి కాసేపటి తరువాత డబ్బాలో ఉంచుకుంటే గుడ్లు పాడవకుండా ఉంటాయి. గుడ్లను ఈ విధంగా నిలువ ఉంచితే నెల రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. గుడ్లను ఫ్రిజ్ లో నెల రోజుల పాటు పాడవకుండా ఉంచవచ్చు. గుడ్లను విడిగా అయితే వారం రోజుల పాటు పాడవకుండా ఉంటాయి. వారం రోజులు దాటితే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే గుడ్లు పాడవుతాయి. కాబట్టి మనం ఇంటిలోకి తెచ్చుకున్న గుడ్లను పైన తెలిపిన పద్దతులను ఉపయోగించి జాగ్రత్తగా నిలువ చేసుకోవచ్చు(Eggs Storage).

 

Also Read : Apple Jam : టేస్టీ ఆపిల్ జామ్ రెసిపీ.. ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో తెలుసా?