Site icon HashtagU Telugu

Sweating Reduce Tips: విపరీతమైన చెమటతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేయాల్సిందే?

Mixcollage 20 Feb 2024 09 42 Pm 3007

Mixcollage 20 Feb 2024 09 42 Pm 3007

మామూలుగా చెమట పట్టడం అన్నది సహజం. కొంతమంది ఎన్ని సార్లు శుభ్రంగా స్నానం చేసినా కూడా విపరీతమైన చెమట వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ చెమట ఇబ్బంది కలిగించడంతో పాటు ఇతరులకు కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఇక ఈ చమట మీద తగ్గించుకోవడానికి చాలా మంది ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా అలా అధిక చెమట సమస్యతో బాధపడుతుంటే ఇప్పుడు మేము చెప్పబోయే చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే. అయితే ఎండాకాలంలో చెమటరావడం సహజంగా జరుగుతుంది. బయట ఎండలు మండిపోతుంటే ఎంతలా ఏయిర్ కండీషనింగ్ ఉన్న రూంలో ఉన్నా… సరే చెమటతో, ఉక్కపోతతో అవస్థలు పడాల్సి వస్తుంది.

ఇలా సమ్మర్లోనే కాకుండా చాలా మందిలో వానాకాలంలో కూడా చెమట సమస్యలు ఉత్పన్నమవుతాయి. కాగా చెమట పట్టినపుడు అసౌకర్యంగా ఉండడం మాత్రమే కాకుండా అనేక చర్మ సమస్యలు తలెత్తుతాయి. కాలాలతో సంబంధం లేకుండా ఎక్కువగా చెమట వచ్చే వారిలో అనేక చర్మ సమస్యలు వస్తాయి. ఇలా అధికంగా చెమట రావడం వల్ల దద్దర్లు, దుర్వాసన రావడం, దురద పుట్టడం చికాకు లాంటి సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. ఇక వానాకాలంలో చెమటతో బాధపడేవారిలో చర్మ సమస్యల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు అధికంగా చెమట రావడానికి ప్రధాన కారణం ఎండ వేడిమి. భరించలేని వేడిమి వాతావరణం వల్ల అనేక మందిలో చెమట వస్తుంది.

ఇలా చెమట చంకలు మరియు సున్నిత ప్రదేశాల్లో వచ్చినపుడు చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఇలా వచ్చిన చెమట నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు చాలా ప్రయత్నిస్తారు. ఇక మరో భయంకరమైన విషయం ఏంటంటే అధికంగా చెమట పోసే వారిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పాటు మొటిమల సమస్య కూడా వస్తుంది. చెమట పోసినపుడు మన శరీరంలోని కొన్ని భాగాలు పూర్తిగా తడిసిపోతాయి. మరికొన్ని ప్రదేశాలు డ్రైగా ఉంటాయి. ఇలా మన శరీరంలో తడిగా కొన్ని భాగాలు, పొడిగా కొన్ని భాగాలు ఉండడం చిరాకును తెప్పిస్తుంది. చెమట కారణంగా మొటిమల సమస్యలు కూడా వస్తాయి కావున జాగ్రత్తగా ఉండడం మంచిది. త్వరలో సమ్మర్ ప్రారంభం కానుంది. ఈ సమ్మర్ లో విపరీతమైన చెమట వచ్చి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని సింపుల్ చిట్కాలను ఫాలో అయితే చాలు, అధిక చెమట సమస్యను తగ్గించుకోవచ్చు.