Head Bath: రాత్రిళ్లు తల స్నానం చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తుంచుకోవాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో చాలామంది బిజీ బిజీ షెడ్యూల్ వల్ల రాత్రి సమయంలో తలస్నానం చేస్తూ ఉంటారు. డ్యూటీ అయిపోగానే ఇంటికి వచ్చి స్నానం చేసి అలాగే ప

  • Written By:
  • Publish Date - August 23, 2023 / 09:56 PM IST

ప్రస్తుత రోజుల్లో చాలామంది బిజీ బిజీ షెడ్యూల్ వల్ల రాత్రి సమయంలో తలస్నానం చేస్తూ ఉంటారు. డ్యూటీ అయిపోగానే ఇంటికి వచ్చి స్నానం చేసి అలాగే పడుకొని నిద్రపోతూ ఉంటారు. తల స్నానం చేయడం మంచిదే కానీ ముఖ్యంగా రాత్రి సమయంలో తలస్నానం చేసేవారు కొన్ని రకాల విషయాలను గుర్తించుకోవడం తప్పనిసరి. మరి రాత్రిపూట తల స్నానం చేసేవారు ఎటువంటి విషయాలను గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రాత్రులు తలస్నానం చేయడం వల్ల తల తడిగా ఉన్నప్పుడే పడుకుంటారు. అయితే, తడి జుట్టు త్వరగా ఊడుతుంది.

పడుకున్న సమయంలో అటు ఇటూ తిరుగుతూ ఇష్టమైన పొజిషన్‌లో పడుకుంటారు. దీంతో జుట్టు ఎక్కువగా చిక్కుబడి జుట్టు ఎక్కువగా ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఉదయం వేళల్లో తలస్నానం చేసేందుకు టైమ్ లేదని సాయంత్రం సమయాల్లో చేస్తుంటారు. దీని వల్ల ఉదయానికి తల ఆరుతుంది. చక్కగా టైమ్‌కి తయారై వెళ్లవచ్చు. అనుకుంటారు. కానీ, ఇది అంత మంచిది కాదు. ఎందుకంటే ఇలా స్నానం చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అదేవిధంగా తలస్నానం చేసి రాత్రి పడుకున్నప్పుడు తలగడ, బెడ్‌కి వెంట్రుకలు ఎక్కువగా అంటుకుంటాయి.

దీంతో అవి కూడా తడిగా మారి బ్యాక్టీరియా ఎక్కువగా తయారవుతుంది. దీంతో జుట్టు సమస్యలు మరింత తీవ్రం అవుతాయి. దీంతో పాటు తడి జుట్టుతో రాత్రి వేళల్లో పడుకున్నప్పుడు జుట్టు మొత్తం ముద్దలా తయారవుతుంది. కాబట్టి తలస్నానం ఉదయం వేళల్లోనే చేయడం మంచిది. రాత్రి సమయాల్లో తలస్నానం చేసి పడుకోవడం వల్ల అలర్జీలు పెరిగి తలసమస్యలు ఎక్కువగా మారతాయి. ఎందుకంటే తలస్నానం చేయడం వల్ల జుట్టు తేమగా ఉండి చుండ్రు, జుట్టురాలడం, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇవన్నీ జుట్టు ఊడిపోవడానికి కారణంగా మారతాయి.
రాత్రి సమయంలో స్థానం చేయడం వల్ల కేవలం జుట్టుకు సంబంధించిన సమస్యలు మాత్రమే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. రాత్రి రాత్రిపూట తల స్నానం చేయడం వల్ల మైగ్రేన్, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. సైనస్ ఉన్నవారికి కూడా ఇది అంత మంచిది కాదు.