Dry Nail Polish: సాధారణంగా ఇంట్లో ఉంచిన నెయిల్ పాలిష్ (Dry Nail Polish) చాలాసార్లు ఎండిపోతుంది. మీ నెయిల్ పాలిష్ కూడా ఎండిపోయినట్లయితే మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఈ రోజు మేము మీకు కొన్ని సులభమైన పద్ధతుల గురించి చెప్పబోతున్నాం. వీటి సహాయంతో మీరు ఎండిపోయిన నెయిల్ పాలిష్‌ను మళ్లీ ఉపయోగించవచ్చు.
వేడి నీటిని ఉపయోగించండి
దీని కోసం ఒక పాత్రలో నీటిని వేడి చేయాలి. నీరు గోరువెచ్చగా ఉంచండి. ఆ తర్వాత ఎండిపోయిన నెయిల్ పాలిష్‌ను కనీసం 20 నిమిషాల పాటు ఈ నీటిలో ఉంచండి. తర్వాత దాన్ని బయటకు తీసి బాగా షేక్ చేయండి. ఇలా చేయడం వల్ల నెయిల్ పాలిష్ మళ్లీ ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటుంది.
థిన్నర్‌ను ఉపయోగించండి
ఎండిపోయిన నెయిల్ పాలిష్‌ను మళ్లీ ఉపయోగించడానికి థిన్నర్‌ను కూడా ఉపయోగించవచ్చు. నెయిల్ పాలిష్‌లో రెండు నుండి మూడు చుక్కల థిన్నర్‌ను వేసి, ఆ తర్వాత దాన్ని మీ అరచేతుల మధ్య ఉంచి రుద్దండి. కనీసం రెండు నిమిషాల పాటు ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
ఎండలో ఉంచండి
గట్టిపడిన నెయిల్ పాలిష్‌ను ఎండలో ఉంచండి. ఎండ ఎక్కువగా ఉంటే కనీసం అరగంట పాటు నెయిల్ పాలిష్‌ను ఇంటి పైకప్పుపై ఉంచవచ్చు. దీనివల్ల కొద్ది సమయంలోనే దాని గట్టిదనం తొలగిపోతుంది. మీరు దాన్ని మళ్లీ ఉపయోగించగలరు.
ఫ్రిజ్‌లో నిల్వ చేయవద్దు
మీరు నెయిల్ పాలిష్‌ను ఫ్రిజ్‌లో ఉంచుతున్నట్లయితే ఈ తప్పు చేయవద్దు. ఎందుకంటే నెయిల్ పాలిష్‌ను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అందులో గడ్డలు ఏర్పడతాయి. అది ఉపయోగించడానికి పనికిరాకుండా పోతుంది. కాబట్టి, వీటిని గది ఉష్ణోగ్రత వద్ద సాధారణంగా నిల్వ చేయడానికి ప్రయత్నించండి.
నెయిల్ పాలిష్‌ను ఎండిపోకుండా ఎవ్వరు కాపాడుకోవాలి?
దీనికి అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు నెయిల్ పాలిష్‌ను సరిగ్గా మూసివేసి ఉంచాలి. నెయిల్ పాలిష్‌ను ఉపయోగించిన తర్వాత మూతను గట్టిగా మూసివేయడం వల్ల గాలి లోపలికి వెళ్లదు. అది ఎండిపోదు.