మాములుగా స్త్రీలకు అవాంఛిత రోమాలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా పెదవుల పైన గడ్డం ప్రాంతంలో, చేతులపై కాళ్లపై విపరీతంగా వెంట్రుకలు వచ్చి అందవిహీనంగా కనిపిస్తూ ఉంటారు. ఇక ఈ అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి ఎన్నెన్నో చిట్కాలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ మళ్లీ మళ్లీ వస్తూ ఉంటాయి. దీంతో ఎక్కువ శాతం మంది వ్యాక్సింగ్ పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. అయితే ముఖంపై వ్యాక్సింగ్ చేయడం అంత మంచిది కాదు. దీనివల్ల ఇంతమందికి దుష్ప్రభావాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. అందుకే సహజమైన పద్ధతుల్లో ముఖంపై అవాంచిత రోహమాలను తొలగించుకోవాలని చెబుతున్నారు. ఇంతకీ ఆ సహజమైన పద్ధతులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సహజ పద్ధతిలో అవాంఛిత రోమాలు తొలగించడంలో చక్కెర, నిమ్మరసం ఎంతో సహాయపడతాయట.
ఇందుకోసం రెండు టేబుల్ స్పూన్ల చొప్పున చక్కెర, నిమ్మరసానికి పది టేబుల్ స్పూన్ల నీళ్లు చేర్చుకోవాలి. ఇప్పుడు ఇది కాస్త చిక్కపడే దాకా మరిగించుకొని చల్లార్చుకోవాలి. సమస్య ఉన్న చోట ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకొని అరగంట అయ్యాక గుండ్రంగా రుద్దుతూ తొలగించుకోవాలి. ఇంకా రెండు టేబుల్ స్పూన్ల చొప్పున చక్కెర, నిమ్మరసం తీసుకొని దానికి టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఆ తర్వాత దీన్ని ఐదు నిమిషాల పాటు వేడి చేసి చిక్కగా చేసుకోవాలి. ముందు వెంట్రుకలు ఉన్న చోట కార్న్‌స్టార్చ్ అప్లై చేసుకొని ఆ తర్వాత చల్లారిన చక్కెర మిశ్రమాన్ని వెంట్రుకలు మొలిచే దిశలో పెట్టుకోవాలి.
తర్వాత అరగంట య్యాక ఒక కాటన్ క్లాత్ సహాయంతో గుండ్రంగా రుద్దుతూ తొలగించుకోవాలి. ఇంకా బాగా పండిన అరటి పండును రెండు టేబుల్ స్పూన్ల ఓట్‌మీల్ తో కలిపి పేస్ట్ లా మిక్సీ పట్టుకోవాలని చెబుతున్నారు. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట అప్లై చేసి15 నిమిషాల పాటు మర్దన చేయాలట. ఆపై చల్లటి నీటితో ముఖం కడిగేసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. దీంతో పాటు టేబుల్ స్పూన్ చొప్పున తేనె, నిమ్మరసం తీసుకొని దానికి ఐదు టేబుల్ స్పూన్ల బంగాళదుంప రసం కలుపుకోవాలి.
అలాగే రాత్రంతా నానబెట్టిన శనగపప్పును పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి సమస్య ఉన్న చోట అప్లై చేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తూ ఉండడం వల్ల అవాంఛిత రోమాలను సమస్య నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా టేబుల్ స్పూన్ చొప్పున కార్న్ స్టార్చ్, చక్కెర తీసుకొని అందులో గుడ్డులోని తెల్లసొన కలిపి, ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట అప్లై చేసుకొని ఆరనిచ్చి, ఇది ఒక పొర మాదిరిగా ఏర్పడ్డాక దీన్ని తొలగించుకుంటే సరిపోతుందని చెబుతున్నారు..