ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో చుండ్రు సమస్య కూడా ఒకటి. చుండ్రు సమస్య కారణంగా తెగ ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. తలపై నుంచి ఒక తెల్లటి పదార్థం పడుతూ ఉంటుంది. దీంతో చాలామంది నలుగురిలోకి వెళ్లాలి అన్న కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. సమస్యకు చెక్ పెట్టడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ ఆయిల్స్ షాంపూలు వంటివి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయినా కూడా కొన్ని కొన్ని సార్లు మంచి ఫలితాలు కనిపించవు. మరి అలాంటప్పుడు ఏం చేయాలో, ఏం చేస్తే ఆ చుండ్రు సమస్య తగ్గుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కోడి గుడ్డులోని తెల్లసొన జుట్టుకు పోషణను అందించడంలో ఎంతగానో సహకరిస్తుందట. చుండ్రును తొలగించడానికి కూడా బాగా సహాయపడుతుందని చెబుతున్నారు. ఇందుకోసం మూడు టేబుల్ స్పూన్ల హెన్నా పొడి టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె రెండు టేబుల్ స్పూన్లు బీట్ చేసిన తెల్ల గుడ్డు సొనలో ఒక బౌల్లో తీసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుతూ మృదువైన పేస్టులా తయారు చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేసి 45 నిమిషాల పాటు అలాగే ఉంచుకొని ఆ తర్వాత గాఢత తక్కువగా ఉన్న షాంపుతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య నుంచి విముక్తి లభిస్తుందట. తరచుగా ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు అని చెబుతున్నారు.
అలాగే జుట్టు కుదుళ్లలో ఉండే ఫంగల్ ఇన్ఫెక్షన్లు తొలగించడంలో మిరియాలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. చుండ్రును తగ్గించడంలో కూడా బాగా పనిచేస్తాయి. అయితే ఇందుకోసం నాలుగు టేబుల్స్ ఫోన్ల హెన్నా పొడిలో కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా కొత్తిమీర పేస్టు తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేసి ఆరిన తర్వాత తక్కువ గాడత ఉండే షాంపూతో తల స్నానం చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుందట.
ఆవ నూనె కూడా చుండ్రు సమస్యను తగ్గించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం పావు లీటర్ ఆవ నూనెను ఒక గిన్నెలో తీసుకొని వేడి చేయాలి. దాని నుంచి పొగలు వస్తున్న సమయంలో స్టౌ ఆఫ్ చేసి గుప్పెడు గోరింటాకు, టీ స్పూన్ మెంతులు వేసి కలపాలి. ఇప్పుడు ఈ నూనెను పూర్తిగా చల్లారనిచ్చి వడకట్టుకొని గాలి చొరబడని సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న నూనెను తలస్నానానికి ముందు కుదుళ్లు, జుట్టుకు పట్టించాలని తెలిపారు. సుమారు గంట తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుందట. ఇలా తరచూ చేస్తుంటే చుండ్రు సమస్య నుంచి త్వరలోనే ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.