ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తోన్న సమస్య చుండ్రు(Dandruff ). చిన్న పిల్లల నుండి పెద్దల వరకు.. ముఖ్యంగా యువతలో చుండ్రు సమస్య అధికంగా ఉంటోంది. పెరుగుతున్న కాలుష్యం(Pollution), ఆహారపు అలవాట్లు, తలస్నానానికి వాడే షాంపూల(Shampoo) వల్ల కూడా చుండ్రు సమస్య పెరుగుతుంది. దీనిని తగ్గించుకునేందుకు నానా ప్రయోగాలు చేస్తుంటారు. చుండ్రు తగ్గకపోగా జుట్టు(Hair) రాలిపోతుంటుంది. వేసవిలో చెమట ఎక్కువగా ఉండటం వల్ల కూడా చుండ్రు (Dandruff) సమస్య వస్తుంటుంది. అలాంటి చుండ్రు సమస్యకు ఇంటి చిట్కాలతో గుడ్ బై చెప్పండి.
చుండ్రుని పోగొట్టే ఇంటి చిట్కాలు :
1. కలబందలో ఉండే జెల్ ని తీసి మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను తలకు రాసుకునే ఆయిల్ లో మిక్స్ చేసి దానిని మొదలు నుంచి చివర వరకూ వెంట్రుకలకు రాయాలి. ఒక గంట తర్వాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి చేయడం వల్ల చుండ్రు తగ్గుతుంది.
2. రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను ట్రీ ఆయిల్ లో మిక్స్ చేసి స్కాల్ప్ కు పట్టించాలి. ఒక పావుగంట సేపు మర్దన చేసి.. వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి.
3. వేప నూనెను ఆలివ్ ఆయిల్ లో కలిపి గోరువెచ్చగా ఉండేలా వేడి చేయాలి. ఈ నూనెను తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. వేపనూనెలో ఉండే చేదు చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది.
4. ఒక చిన్న అల్లంముక్కను కొబ్బరినూనెలో వేసి మరిగించాలి. అది చల్లారిన తర్వాత కుదుళ్లకు నూనెను పట్టించి మర్దన చేయాలి. కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేయాలి.
5. గుప్పెడు మెంతులను నీటిలో ఒకరాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని పేస్ట్ చేసి తలకు పట్టించాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే.. చుండ్రు నుండి ఉపశమనం కలుగుతుంది. ఇలా నెలకు రెండుసార్లు చేస్తే చుండ్రు పూర్తిగా తగ్గిపోతుంది.
6. యాపిల్ సైడర్ వెనిగర్ ను అరటిపండు గుజ్జులో కలిపి, ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే.. చుండ్రు నుండి ఉపశమనం ఉంటుంది.
7. వేప ఆకు, మందార ఆకులను కలిపి పేస్ట్ చేసి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు తగ్గడంతో పాటు జుట్టు మెత్తగా, మృదువుగా కూడా ఉంటుంది.
8. కొబ్బరి నూనెలో ముద్దకర్పూరం వేసి నూనెను మరిగించాలి. ఈ నూనెను ప్రతిరోజూ తలకు రాసుకోవడం ద్వారా కూడా చుండ్రుని తగ్గించుకోవచ్చు.
Also Read : Coriander Leaves: కొత్తిమీర వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరు?