Face Redness Reduce tips: ఎండ కారణంగా ముఖం ఎర్రగా మారిందా.. అయితే ఇలా చేయాల్సిందే?

వేసవికాలం మొదలయ్యింది అంటే చాలు స్కిన్ కి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు మొదలవుతూ ఉంటాయి. అటువంటి వాటిలో ముఖంపై వచ్చే సమస్యలు కూడా

  • Written By:
  • Updated On - February 29, 2024 / 08:06 PM IST

వేసవికాలం మొదలయ్యింది అంటే చాలు స్కిన్ కి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు మొదలవుతూ ఉంటాయి. అటువంటి వాటిలో ముఖంపై వచ్చే సమస్యలు కూడా ఒకటి. వేసవిలో అలా కొద్దిసేపు బయటికి వెళ్లి వస్తే చాలు వెంటనే ముఖం నల్లగా అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు వేసే కాలం కొన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తే చాలు ఆ సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు. మరి అందుకోసం ఏమి చేయాలి అన్న విషయానికి వస్తే.. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. గ్రీన్ టీ ని లోపలికి తీసుకున్నా, శరీరం పైన అప్లై చేసినా కూడా ఈ సుగుణాలు మనకి అందుతాయి. గ్రీన్ టీ లో ఉన్న పాలీఫెనాల్స్ బాగా పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇవి యాక్నే ని ట్రీట్ చేయడం లో హెల్ప్ చేస్తాయి.

గ్రీన్ టీ యూవీ రేస్ నుండి కూడా ప్రొటెక్షన్ ని కలుగ చేస్తుంది. సన్‌బర్న్ అనగానే గుర్తుకు వచ్చే ఇంకొకటి అలో వెరా. అలో వెరాని ఎప్పటి నుండోనే హీలింగ్ ప్లాంట్ గా వాడుతూ ఉన్నారు. ఈ ఆకుల మధ్యలో ఉన్న క్లియర్ జెల్ లో నే మాజిక్ అంతా ఉంది. ఈ జెల్ కి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వరీల్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్కిన్ హెల్త్ కి ఎంతో హెల్ప్ చేస్తాయి. స్కిన్ యొక్క ఇన్‌ఫ్లమేటరీ రియాక్షన్ ని అడ్డుకుంటాయి, ఆంటే ముఖం ఎర్రగా మారకుండా ఉంటుంది. అదేవిధంగా కళ్ళ మీద కీరా స్లైసులు పెట్టుకుని విశ్రాంతిగా వెనక్కి వాలి కూర్చున్న వ్యక్తి ముఖమే కళ్ళ ముందు కనబడుతుంది. కీరా లో తొంభై ఐదు శాతం నీరే ఉంటుంది. అందుకే అది డ్రై నెస్ వల్ల వచ్చే ఎర్రదనాన్ని తగ్గిస్తుంది.

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల కీరా కి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఒక కీరా ని ప్యూరీలా చేసి ఆ ప్యూరీని ముఖానికి పట్టించి కొన్ని నిమిషాల తరువాత కడిగేయండి. అయితే ఈ ప్యూరీలో ఉన్న నీటి వల్ల కాసేపటికే స్కిన్ డ్రై గా అయిపోతుంది. అందుకే మాస్క్ కడిగేయగానే, క్రీం కానీ, ఆయిల్ కానీ ముఖం మీద అప్లై చేస్తే స్కిన్ హైడ్రేటెడ్ గా ఉంటుంది. మనూకా హనీని స్కిన్ మీద అప్లై చేయడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని రిసెర్చ్ ప్రూవ్ చేస్తోంది. మనూకా హనీ స్కిన్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ని రెగ్యులేట్ చేస్తుంది, టిష్యూ రిపెయిర్ ని ప్రమోట్ చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వలన ఫేస్ మీద రెడ్‌నెస్ తగ్గుతుంది. సాంప్రదాయ సిద్ధంగా ఎలాంటి తేనెనైనా గాయాలు, రాషెస్ కి అప్లై చేస్తుంటారు. ఇది సహజ సిద్ధంగా స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది. మనూకా హనీ ఇన్‌గ్రీడియెంట్ లిస్ట్ లో ఉన్న క్రీమ్స్, ఫేస్ మాస్క్స్, క్లెన్సర్స్, లోషన్స్ మీకు ఉపయోగపడతాయి. ముఖం మీద ఎర్రదనాన్ని తగ్గించి చర్మానికి చల్లదనాన్నిచ్చే ఇంకొక ఇన్‌గ్రీడియెంట్ కొలాయిడల్ ఓట్మీల్. డ్రైనెస్, దురద, ఎగ్జిమా, ఎర్రదనం వంటి అనేక స్కిన్ ప్రాబ్లమ్స్ కి ఇది పని చేస్తుంది. ఇది స్కిన్ బారియర్ ని హీల్ చేస్తుంది.

కొలాయిడల్ ఓట్మీల్ యొక్క ఫలితాలని పొందడం కోసం లోషన్స్, క్రీమ్స్ లో కొలాయిడల్ ఓట్మీల్ ఉన్నవి తీసుకుని ముఖం ఎర్రగా మారే ప్రదేశాల్లో అప్లై చేయాలి. మనకి సరిపడని ఫుడ్స్ తిన్నప్పుడు కూడా ఫేస్ మీద ఎర్రగా అయిపోతుంది. హాట్ సాస్, రెడ్ పెప్పర్, కేయీన్ పెప్పర్, వంటి స్పైసీ ఫుడ్స్ కొంత మందికి సరిపడకపోవచ్చు. అలాగే, దాల్చిన చెక్క, టమాటాలు, సిట్రస్, చాకొలేట్ కూడా ఎవాయిడ్ చేయండి. వేడి వేడి గా తాగే కాఫీ, టీ కూడా ఒకోసారి ఈ సమస్యని పెంచుతాయి. ఆల్కహాల్ వల్ల వచ్చే సమస్యల్లో హ్యాంగోవర్ ఒకటి. దానితో పాటు ఫేషియల్ రెడ్‌నెస్ కూడా ఇంకొక సమస్య. వైన్, బీర్, హార్డ్ లిక్కర్ అన్నింటి వల్లా ఫేషియల్ రెడ్‌నెస్ పెరుగుతుంది. అయితే, ఆల్కహాల్ తీసుకోని వారికి కూడా ఈ కండిషన్ రావచ్చని గమనించాలి.