Site icon HashtagU Telugu

Mouth Ulcers : నోటి పుండ్లను తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలు ఫాలో అవ్వండి..

How to Reduce Mouth Ulcers with Home Tips

How to Reduce Mouth Ulcers with Home Tips

చాలామందికి నోటిలో పుండ్లు(Mouth Ulcers) వస్తూ ఉంటాయి. ఎవరికైతే ఒంట్లో వేడి ఎక్కువగా ఉంటుందో వారికి ఎక్కువగా వస్తుంటాయి. ఇవి వచ్చినప్పుడు ఆహారం(Food) తీసుకోవాలి అన్నా లేదా నీరు తాగాలన్నా ఇబ్బంది పడుతుంటారు. నోటిలో పెదాల కింద, నాలుక మీద, బుగ్గల మీద వస్తుంటాయి. వీటిని ఇంటి చిట్కాలను(Home Tips) ఉపయోగించి తొందరగా తగ్గించుకోవచ్చు.

*నోటిలో పుండ్లు ఉన్న చోట తేనె రాసుకోవాలి. ఇలా చేయడం వలన తేనెలో ఉండే యాంటి బ్యాక్టీరియల్ లక్షణాలు నోటి పూతకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం అయ్యేలా చేస్తుంది.
* కొబ్బరి నీటిని తాగడం వలన నోటిపూత తగ్గడానికి సహాయపడుతుంది.
* మూడు స్పూన్ల ఆపిల్ సైడర్ ను నీటిలో కలుపుకొని దానిని నోటిలో 30 సెకండ్ల పాటు ఉంచి పుక్కలించి ఊంచాలి. ఇలా చేయడం వలన నోటిలో పుండ్లు తగ్గుతాయి.
* ఉప్పు నీటిని నోటిలో ఉంచుకొని పుక్కిలించడం వలన నోటిలో పుండ్లు తగ్గుతాయి.
* అర స్పూన్ త్రిఫల చూర్ణాన్ని ఒక కప్పు నీటిలో వేసుకొని డికార్షన్ లాగా చేసుకొని దానిని నోటిలో వేసుకొని పుక్కిలించుకోవాలి. ఇలా చేసినా నోటిలో పుండ్లు తగ్గుతాయి.
* పది గ్రాముల పటికబెల్లం, ఒక గ్రాము కర్పూరం కలిపి పొడి చేసుకొని దానిని నోటి పుండ్లు ఉన్న చోట రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
* తులసి ఆకులను నమిలి తినాలి ఇలా చేయడం వలన తులసి ఆకుల నుండి ఉత్పత్తి అయ్యే రసం నోటి పుండ్లను తగ్గించడానికి సహాయపడుతుంది.
* పుల్లటి పండిన టమాటా తినడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది.

 

Also Read : Honey With Milk Benefits: పాలలో తేనె కలిపి తాగితే ఎన్నో బెనిఫిట్స్.. ముఖ్యంగా అలాంటి వారికి..!