Used Green Tea Bags : వాడిన తరువాత గ్రీన్ టీ బ్యాగ్‌లను.. ఈ విధంగా ఉపయోగించుకోండి..

వాడిన గ్రీన్ టీ బ్యాగ్స్(Used Green Tea Bags) ను పారేయకుండా వాటిని రీసైకిల్ చేసి రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు.

Published By: HashtagU Telugu Desk
How to Recycle and Re Use Used Green Tea Bags

How to Recycle and Re Use Used Green Tea Bags

గ్రీన్ టీ(Green Tea) తీసుకోవడం వలన అది మన ఆరోగ్యానికి(Health) ఎంతో మంచిది. దీనిలో యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వలన వ్యాధులను తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ రోజుల్లో చాలా మంది బరువు తగ్గడానికి ఉదయం పూట ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగుతుంటారు. బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి కూడా గ్రీన్ టీ తాగుతారు. అయితే ఇలా వాడిన గ్రీన్ టీ బ్యాగ్స్(Used Green Tea Bags) ను పారేయకుండా వాటిని రీసైకిల్ చేసి రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు.

గ్రీన్ టీ బ్యాగ్ లను కట్ చేసి వాటిని మన ఇంటిలో ఉండే పూల తోట లేదా కూరగాయల మొక్కలు ఉన్న చోట వేస్తే వాటికి ఎరువుగా ఉపయోగపడుతుంది. ఇవి నేలలో పోషకాలను పెంచి మొక్కలు బాగా ఎదగడానికి ఉపయోగపడుతుంది.

గ్రీన్ టీ బ్యాగ్ లను కట్ చేసి అందులో టీ పొడిని ఆరబెట్టాలి. తరువాత దానిని ఒక గిన్నెలో వేసి దానిని రిఫ్రిజిరేటర్ లో ఉంచితే రిఫ్రిజిరేటర్ లో ఉండే చెడు వాసన పోతుంది.

గ్రీన్ టీని ఉపయోగించిన తరువాత వాటిని ఫ్రిజ్ లో ఉంచి తరువాత ఆ చల్లని గ్రీన్ టీ బ్యాగ్ లను మన కళ్ళ కింద ఉంచితే మన కళ్ళ చుట్టూ ఉండే నల్లని వలయాలను, కళ్ళ చుట్టూ ఉండే వాపును తగ్గించుకోవచ్చు.

కొంతమందికి చెమట వాసన తొందరగా వస్తుంది. అలా ఉన్నవారు వారు స్నానం చేసే నీటిలో గ్రీన్ టీ బ్యాగ్ ను ఉంచి ఆ నీటితో చెమట వాసన తగ్గుతుంది. ఈ నీటితో స్నానం చేయడం వలన మన చర్మం తాజాగా తయారవుతుంది. కాబట్టి గ్రీన్ టీ బ్యాగ్స్ ను పారేయకుండా ఈ విధంగా వాడవచ్చు.

 

Also Read : Jeera Rice: జీరారైస్ ఇలా చేస్తే చాలు లొట్టలు వేసుకొని తినేయాల్సిందే?

  Last Updated: 30 Aug 2023, 09:32 PM IST