Plants : ఎండాకాలంలో మొక్కలను ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.. పోషకాలు ఎలా అందించాలి..?

ఎండాకాలంలో(Summer) మనం ఎంత వేడిగా ఫీల్ అవుతామో అదేవిధంగా మొక్కలు(Plants)కూడా ఎండాకాలంలో ఎండకు వాడిపోతుంటాయి. కాబట్టి మొక్కలు ఎండాకాలంలో ఫ్రెష్ గా ఉండాలంటే కొన్ని చిట్కాలను(Tips) పాటించాలి.

  • Written By:
  • Publish Date - May 21, 2023 / 10:30 PM IST

ఎండాకాలంలో(Summer) మనం ఎంత వేడిగా ఫీల్ అవుతామో అదేవిధంగా మొక్కలు(Plants)కూడా ఎండాకాలంలో ఎండకు వాడిపోతుంటాయి. కాబట్టి మొక్కలు ఎండాకాలంలో ఫ్రెష్ గా ఉండాలంటే కొన్ని చిట్కాలను(Tips) పాటించాలి.

* ఎండాకాలంలో మొక్కల దగ్గర మట్టి ఎప్పుడూ తడిగా ఉండేలా చూడాలి. కానీ మొక్కలకు నీటిని ఉదయం సూర్యోదయం ముందు సాయంత్రం సూర్యాస్తమయం తరువాత పోయాలి. అప్పుడే మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి.
* మొక్కలకు ఏవైనా ఎరువులు వెయ్యాలి అనుకుంటే ఆర్గానిక్ ఎరువులు వాడుకోవాలి.
* మొక్కలకు ఎరువులు వేసేటప్పుడు ఎండ ఉన్న సమయంలో వేయకూడదు.
* మొక్కల వేర్లకు ఎండ తగలకుండా ఉండడానికి ఎండాకాలంలో మల్చింగ్ చేయాలి అంటే మొక్కల మొదళ్ళ దగ్గర ఎండిన ఆకులు, పువ్వులు, చెక్క పొడిని లేదా ఒక పేపర్ ను పెట్టి కప్పి ఉంచాలి.
* ఎండాకాలంలో మొక్కలు ఎండిపోకుండా బాగుండాలి అంటే ఎప్పటికప్పుడు పురుగులు పట్టిన ఆకులని, మొక్కకు ఎండిపోయిన ఆకులను తొలగించాలి. అప్పుడే మొక్కలు ఎండిపోకుండా, పురుగులు పట్టకుండా ఉంటాయి.
* చిన్న, పెద్ద మొక్కలని పక్క పక్కన పెంచుకోవాలి. ఇలా చేయడం వలన చిన్న మొక్కలపై ఎండ నేరుగా పడకుండా ఉంటుంది.
* మొక్కలకు ఎండాకాలంలో ఎండ, నీడ తగిలేలా చూసుకోవాలి దానికోసం ప్రత్యేకమైన ఫ్యాబ్రిక్ తో మొక్కలకు నీడను కల్పించాలి.
* మొక్కల కోసం కూరగాయలు కడిగిన నీరు, బియ్యం కడిగిన నీరు, మినపపప్పు నానబెట్టిన నీరు, ఇంకా వంటింట్లో ఉపయోగించిన నీటిని ఉంచి సాయంత్రం ఎండ తగ్గినాక మొక్కలకు పోయాలి. అప్పుడు మొక్కలు ఎండాకాలంలో కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి.
* మొక్కలకు నీటిని ఎండాకాలంలో పోసేటప్పుడు గార్డెనింగ్ బకెట్లు వాడి బిందురూపంలో పోయాలి అప్పుడే మొక్కలకు మంచిగా నీరు అందుతుంది.

 

Also Read :  Vasthu Tips: అక్వేరియం ఇంట్లో ఉండవచ్చా.. ఉంటే ఏ దిశగా ఉండాలి ఎన్ని చేపలు ఉండాలో తెలుసా?