మాములుగా చాలామందికి కాలంతో సంబంధం లేకుండా ఆ పెదవులు పగులుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు పెదవులు పగలడంతో పాటు రక్తం కూడా వస్తూ ఉంటుంది. అయితే పెదవులు పగిలినప్పుడు చాలా మంది వాజిలిన్, లిబ్బామ్ వంటివి పట్టించిన కూడా వెంటవెంటనే తడి ఆరిపోతూ పెదవులు డ్రైగా మారుతూ ఉంటాయి. పొరపొరలుగా చర్మం రాలిపోతుంది. ఆ పొరలు తీస్తే మంటగా, ఒక్కోసారి రక్తం కూడా వచ్చేస్తుంది. మరి పెదవులు పగలకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చాలామంది పెదవులు పొడిబారుతున్నప్పుడు ఎక్కువగా చేసే పని నాలుకతో పెదవులకు తేమ చేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. అలా పెదవులను తడపడం వల్లే పెదవులు పొడిబారి మరింతగా ఎండిపోతాయి. అలాగే పెదవులపై ఎండి పొరలను తీసే వాళ్లు కూడా ఎక్కువే. అలా తీయడం వల్ల రక్తం వచ్చి చిన్న చిన్న గాయాలు మారతాయి. కాబట్టి మొదట ఈ రెండు పనులు చేయడం మానేయాలి.
ఇందుకోసం విటమిన్ ఇ, విటమిన్ ఎ లను కలిగిన లిప్ బామ్ ను వాడితే మంచిది. ఇవి పెదవులకు కావాల్సిన తేమను అందిస్తాయి. చలికాలంలో వాతావరణం చాల్లగా ఉండటం వల్ల చాలామంది నీటిని తక్కువగా తాగుతూ ఉంటారు. అలా కాకుండా ఎప్పటిలాగే చలికాలంలో కూడా రోజూ ఎనిమిది గ్లాసులకు తగ్గకుండా నీళ్లు తాగాలి. దీని వల్ల పెదవులకు కూడా కావాల్సినంత తేమ శరీరం నుంచి అందుతుంది. అదేవిధంగా చాలామంది పెదవులను ఎర్రగా మార్చుకోవడం కోసం అలాగే పెదవులు పొడిబారకుండా చూసుకోవడం కోసం మార్కెట్లో దొరికే దగ్గర బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. వాటి వల్ల పెదవులు ఎర్రగా మారకపోగా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. కాబట్టి నిపుణుల సలహా మేరకు పెదవులకు మంచి మంచివి ఉపయోగించడం మంచిది.