Site icon HashtagU Telugu

Vegetable Jonna Sangati : వెజిటేబుల్ జొన్న సంగటి ఎలా చేయాలి? ఆరోగ్యానికి ఎంతో మంచిది.

How to Prepare Vegetable Jonna Sangati in Home Simple Recipe

How to Prepare Vegetable Jonna Sangati in Home Simple Recipe

జొన్న(Jowar) సంగటి, రాగి సంగటి అనేవి మనకు బలాన్ని ఇచ్చే ఆహారాలు. వాటిని మనం మాములుగా వండేబదులు కొన్ని కూరగాయలు వేసి కూడా వండుకోవచ్చు. అప్పుడే అది మరింత రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.

వెజిటేబుల్ జొన్న సంగటి(Vegetable Jonna Sangati) తయారీకి కావలసిన పదార్థాలు:-
* ఒక కప్పు జొన్న రవ్వ
* మూడు కప్పుల నీళ్ళు
* కొద్దిగా పసుపు
* మూడు స్పూన్ల నూనె
* పచ్చిమిర్చి మూడు తరిగినవి
* కొద్దిగా ధనియాల పొడి
* కొద్దిగా జీలకర్ర పొడి
* చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
* జీలకర్ర కొద్దిగా
* ఆవాలు కొద్దిగా
* క్యాప్సికం ముక్కలు పావు కప్పు
* స్వీట్ కార్న్ పావు కప్పు
* టమాటా ముక్కలు పావు కప్పు
* క్యారెట్ ముక్కలు పావు కప్పు
* ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు
* ఉప్పు తగినంత
* కొత్తిమీర కొద్దిగా

ముందు ఒక కుక్కర్ తీసుకొని దానిలో నూనె వేసుకొని కాగాక జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారేవరకు వేగనివ్వాలి. వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, స్వీట్ కార్న్ వేసి కలబెట్టి మూత పెట్టాలి. కూరగాయలు అన్ని కొద్దిగా మెత్తగా అయ్యాక జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి కలబెట్టాలి.

ఇప్పుడు నీళ్ళు పోసుకొని ఒక ఉడుకు వచ్చిన తరువాత దానిలో జొన్న రవ్వను కలబెడుతూ ఉండలు రాకుండా పోసుకోవాలి. అనంతరం కుక్కర్ కు మూత పెట్టి నాలుగు విజిల్స్ రానివ్వాలి. వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ మూత తీసిన తరువాత కొత్తిమీర వేసి కలబెట్టితే వేడి వేడిగా జొన్న సంగటి రెడీ అయినట్లే. ఇందులోకి ఇంకా కావాలంటే క్యాలీఫ్లవర్, బీన్స్, సొరకాయ.. లాంటి పలు కూరగాయలను కూడా వేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది మరియు మనకు ఆరోగ్యకరమైనది కూడా.