Site icon HashtagU Telugu

Chicken Sweet Corn Soup : చికెన్ స్వీట్ కార్న్ సూప్ టేస్టీగా ఇలా చేసుకోండి.. చలికాలంలో వేడివేడిగా..

How to Prepare Tasty Chicken Sweet Corn Soup in Home Recipe

How to Prepare Tasty Chicken Sweet Corn Soup in Home Recipe

ఇప్పుడు రోజూ ఉదయం పూట చాలా ఎండగా ఉన్నా కానీ సాయంత్రం సమయంలో చలిగా ఉంటుంది. చలికాలం కూడా మొదలైపోతుంది. కాబట్టి ఈ చలికాలంలో(Winter) వేడి వేడిగా టీ లేదా కాఫీ తాగితే చాలా బాగుంటుంది అని మనం అనుకుంటాము. అయితే ఎప్పుడూ టీ కాఫీలు తాగినా ఆరోగ్యానికి మంచిది కూడా కాదు. కొత్తగా సూప్ లు కూడా తాగవచ్చు. ఈ సూప్ లు మన ఆరోగ్యానికి కూడా మంచివి, ఇంకా ఈ చలికాలంలో వేడి వేడిగా రుచిగా ఉంటాయి. చికెన్ స్వీట్ కార్న్ సూప్(Chicken Sweet Corn Soup) టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది.

చికెన్ స్వీట్ కార్న్ సూప్ తయారీకి కావలసిన పదార్థాలు..

* చికెన్ చిన్న చిన్న ముక్కలు వంద గ్రాములు
* క్యారెట్ ముక్కలు అర కప్పు
* క్యాబేజి అరకప్పు
* స్వీట్ కార్న్ రెండు కప్పులు
* మిరియాల పొడి ఒక చెంచా
* కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్
* ఉప్పు రుచికి తగినంత
* నూనె తగినంత
* కారప్పొడి అర స్పూన్
*పసుపు కొద్దిగా

ఒక గిన్నెలో నీరు పోసుకొని అందులో చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న చికెన్, దానిపై కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకొని దానిలో కొద్దిగా నూనె వేసుకోవాలి నూనె కాగిన తరువాత స్వీట్ కార్న్, సన్నగా తరిగిన క్యాబేజి ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. లీటర్ నీళ్ళు పోసి కలపాలి. కాసేపు అవి ఉడికిన తర్వాత మిరియాల పొడి, కారప్పొడి, చికెన్ వేసి కలుపుకోవాలి. ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని కార్న్ ఫ్లోర్ ను ఉండలు లేకుండా కలుపుకోవాలి. దానిని కూడా పాన్ లో వేయాలి చికెన్ మెత్తగా అయ్యేవరకు బాగా ఉడకనివ్వాలి. అంతే మనకు వేడి వేడిగా ఉండే చికెన్ స్వీట్ కార్న్ సూప్ రెడీ అయినట్లే. ఇంట్లో మనుషులు ఎంతమంది ఉంటె దాన్నిబట్టి వాటర్, చికెన్ క్వాంటిటీని పెంచుకోవచ్చు.

Also Read : BellyFat : ఈ నాలుగు టిప్స్ పాటిస్తే.. పొట్ట దగ్గరి కొవ్వు కొవ్వొత్తిలా కరగడం ఖాయం..