Mamidikaya Pulihara : సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహార తయారీవిధానం..

నిమ్మకాయ పులిహార, చింతపండు పులిహార ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ సమ్మర్ లో మాత్రమే మామిడికాయ పులిహార వండుకోగలము.

  • Written By:
  • Publish Date - May 24, 2024 / 06:17 PM IST

Mamidikaya Pulihara : నిమ్మకాయ పులిహార, చింతపండు పులిహార ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ సమ్మర్(Summer)లో మాత్రమే మామిడికాయ పులిహార వండుకోగలము. సమ్మర్ లో మాత్రమే మామిడికాయలు(Mangoes) దొరుకుతాయి కాబట్టి సమ్మర్ లో ఈ పులిహార చేసుకొని తినొచ్చు. మామిడికాయ పులిహార వండుకోవడానికి ముందుగా అన్నం వండుకోవాలి.

మొదట కుక్కర్ లో ఒక గ్లాస్ బియ్యానికి 1 1 / 2 గ్లాస్ నీళ్ళు పోసి మీకు కావాల్సినంతగా బియ్యం తీసుకొని అందులో రెండు నూనె చుక్కలు వేసి వండుకోవాలి. ఎందుకంటే మామిడికాయ పులిహారకు అన్నం పొడిగా ఉంటేనే బాగుంటుంది నూనె వేయడం వలన అన్నం అతుక్కోకుండా పొడిగా తయారవుతుంది.

అన్నం వండిన తరువాత దానిని ఒక గిన్నెలో పోసి చల్లారనివ్వాలి. దానికి సరిపడ ఉప్పు వేసి కలపాలి. ముందుగా మామిడికాయ టేస్ట్ చూడాలి. ఎందుకంటే మామిడికాయ పుల్లగా ఉంటేనే పులిహార బాగుంటుంది. మామిడికాయను శుభ్రంగా కడిగి పొట్టు తీసి మామిడికాయను తురమాలి. మామిడికాయ తురుమును కూడా అన్నానికి కలపాలి.

అనంతరం ఒక చిన్న మూకుడులో కొద్దిగా నూనె వేసి కొన్ని పచ్చిమిర్చికి మధ్యలో ఘాటు పెట్టి నూనెలో వేసి తీసుకోవాలి. ఆ తర్వాత కొన్ని పల్లీలను వేసి వేగనివ్వాలి. అవి వేగిన తరువాత కొద్దిగా పచ్చిశనగపప్పు, సాయి పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేయాలి. ఇలా తాలింపు అంతా వేగాక ఇందాక మామిడికాయ తురుము కలిపిన అన్నంలో తాలింపు, వేగిన పచ్చిమిర్చిని వేసి కలుపుకోవాలి. అంతే వేడివేడిగా మామిడికాయ పులిహార రెడీ అయినట్టే. సమ్మర్ లో మామిడికాయ పులిహార తింటే వచ్చే ఆనందమే వేరు.

 

Also Read : One8 Commune : హైద‌రాబాద్‌లో కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించిన విరాట్ కోహ్లీ