Ridge Gourd Bajji : ఇప్పుడు వర్షాకాలంలో మనకు వేడి వేడిగా బజ్జీలు తినాలని అనిపిస్తుంది. అయితే ఆ బజ్జీలు కూడా ఆరోగ్యకరంగా ఉండాలి. కాబట్టి మనం ఇంటిలోనే బీరకాయతో బజ్జీలు తయారుచేసుకోవచ్చు.
బీరకాయ బజ్జి తయారీకి కావలసిన పదార్థాలు..
* లేత బీరకాయ ఒకటి
* శనగపిండి ఒక కప్పు
* బియ్యం పిండి ఒక స్పూన్
* కారం పొడి ఒక స్పూన్
* పచ్చిమిర్చి మూడు
* వాము కొద్దిగా
* వంట సోడా కొద్దిగా
* నీరు సరిపడ
* నూనె వేయించుకోవడానికి తగినంత
* ఉప్పు రుచికి తగినంత
* చాట్ మసాలా పొడి కొద్దిగా
బీరకాయ బజ్జి తయారు చేయు విధానం..
ముందు బీరకాయను చెక్కు తీసి రౌండ్ ముక్కలుగా లేదా నిలువు ముక్కలుగా కోసుకోవాలి. ఒక గిన్నెలో బియ్యం పిండి, శనగపిండి, కారం, పచ్చిమిర్చి, వాము, వంట సోడా, ఉప్పు, నీళ్ళు పోసి బజ్జీలు వేసుకునేందుకు వీలుగా ఉండేవిధంగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకొని నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె కాగిన తరువాత దానిలో బీరకాయను బజ్జీల పిండి లో ముంచి వేయాలి. వాటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అవి వేగిన తరువాత వాటిని ఒక ప్లేటులో తీసుకొని దాని పైన చాట్ మసాలా జల్లుకొని తింటే ఎంతో రుచిగా ఉంటాయి. ఈ బీరకాయ బజ్జీలను చట్నీ లేదా టమాటా సాస్ పెట్టుకొని తింటే ఇంకా బాగుంటాయి. దీంతో ఇటు బజ్జిలు తిన్నట్టు ఉంటుంది. అటు హెల్త్ పాడవకుండా ఉంటుంది.
బీరకాయ వల్ల లాభాలు..
బీరకాయను మనం ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన మన శరీరంలో రోగనిరోధకశక్తి పెంచుతుంది. బ్లడ్ షుగర్ ని కంట్రోల్ లో ఉండేలా చేస్తుంది. బీరకాయ తినడం వలన మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. బీరకాయను తినడం వలన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బీరకాయ పీచు పదార్థం కాబట్టి హెల్త్ కి చాలా మంచిది. అందుకే ఈ వర్షాకాలంలో ఒక్కసారైనా బీరకాయ బజ్జి చేసుకొని తినాలి.
Also Read : Pigeon Causes: మీ ఇంట్లో పావురాలు ఉన్నాయా..? అయితే ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్..?