Ragi Oats Laddu : రాగి పిండి, ఓట్స్‌తో కలిపి లడ్డు తిన్నారా? ఎలా తయారు చేయాలో తెలుసుకోండి..

రాగిపిండితో అట్టు, సంగటి, జావ వంటివి తయారు చేసుకుంటూ ఉంటాము. అలాగే రాగిపిండి, ఓట్స్ కలిపి లడ్డూ(Ragi Oats Laddu)లను తయారుచేయవచ్చు.

  • Written By:
  • Publish Date - July 15, 2023 / 11:00 PM IST

రాగిపిండితో అట్టు, సంగటి, జావ వంటివి తయారు చేసుకుంటూ ఉంటాము. అలాగే రాగిపిండి, ఓట్స్ కలిపి లడ్డూ(Ragi Oats Laddu)లను తయారుచేయవచ్చు. అవి ఎంతో రుచిగాను ఉంటాయి. మన ఆరోగ్యానికి కూడా మంచివి.

రాగి ఓట్స్ లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు..

* ఓట్స్ అరకప్పు
* రాగి పిండి ఒక కప్పు
* నెయ్యి అరకప్పు
* జీడిపప్పు కొద్దిగా
* బెల్లం తురుము ఒక కప్పు

రాగి ఓట్స్ లడ్డు తయారు చేయు విధానం..

ఒక కడాయిలో నెయ్యి కొద్దిగా వేసి ఓట్స్ ను వేయించాలి. వేగిన తరువాత పక్కకు పెట్టుకొని దానిని మిక్సి పట్టాలి. తరువాత మళ్ళీ కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి రాగి పిండి పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకోవాలి. వేగిన తరువాత ఓట్స్ పిండిని కలిపి వేయిస్తూ ఉండాలి. నాలుగు నిముషాల పాటు కలబెట్టిన తరువాత బెల్లం తురుమును కలపాలి. బెల్లం తురుము మెత్తబడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి. దానిలో వేయించిన జీడిపప్పులు వేసుకొని బాగా కలుపుకోవాలి. చల్లారిన తరువాత చేతికి నెయ్యి రాసిన తరువాత రాగిపిండిని లడ్డు లాగా చుట్టుకోవాలి. ఈ విధంగా చేస్తే రాగి ఓట్స్ లడ్డు తయారైనట్లే ఇవి ఎంతో రుచికరంగాను మనకు ఆరోగ్యకరంగాను ఉంటాయి.

 

Also Read : Coffee for skin: కాఫీ పౌడర్ తో మెరిసే చర్మం సొంతం చేసుకోండిలా?