Site icon HashtagU Telugu

Peanut Masala Curry : పల్లీలతో మసాలా కూర ఎలా తయారుచేసుకోవాలో తెలుసా?

How To prepare Peanut Masala Curry in Home Simple Recipe

How To prepare Peanut Masala Curry in Home Simple Recipe

పల్లీలతో(Peanuts) చట్నీ, పల్లీ పట్టీ, పల్లీలతో పొడి చేసుకొని తింటాము. కొన్ని రకాల కూరలలో, తాలింపులలో, వంటల్లో కూడా వాడుతుంటాము. పల్లీలు అనేక పోషకాలను కలిగి ఉండడం వల్ల ఇవి తినడం వలన మన ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే మనం పల్లీలతో మసాలా కూర కూడా తయారుచేసుకోవచ్చు.

పల్లీల మసాలా కూర(Peanut Masala Curry) తయారీకి కావలసిన పదార్థాలు..

* వేడి నీళ్ళలో నానబెట్టిన పల్లీలు ఒక కప్పు
* నూనె రెండు స్పూన్లు
* టమాటాలు రెండు తరిగినవి
* జీడిపప్పులు పది
* పచ్చి కొబ్బరి ముక్కలు అర కప్పు
* ఎండుమిర్చి రెండు
* గరం మసాలా పావు స్పూన్
* వాము అర స్పూన్
* కారం అర స్పూన్
* జీలకర్ర
* ఆవాలు
* అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్
* వెల్లుల్లి రెబ్బలు దంచినవి రెండు
* ఉల్లిపాయ తరిగినది ఒకటి
* కరివేపాకు రెబ్బలు రెండు
* ఉప్పు తగినంత
* నీళ్ళు 150 ml

ముందు ఒక గిన్నెలో పల్లీలను తీసుకొని దానిలో అవి మునిగేంతవరకు నీటిని పోసి పల్లీలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత ఒక గిన్నెలో కొద్దిగా నూనె వేసి టమాటాలు, కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు, ఎండుమిర్చి వేసుకొని టమాటాలు మెత్తగా అయ్యేవరకు వేగనివ్వాలి. తరువాత వాటిని చల్లార్చి మిక్సి జార్ లో వేసుకొని గరం మసాలా, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మెత్తగా మిక్సి పట్టుకోవాలి.

అనంతరం ఒక గిన్నెలో నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని తాలింపు వేగనివ్వాలి అవి వేగిన తరువాత వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత ఉడికించి ఉంచుకున్న పల్లీలను నీటితో సహా వేసుకోవాలి. దీంతో పాటు మనం మిక్సి పట్టుకున్న పేస్ట్, తగినంత ఉప్పు వేసుకొని కలబెట్టుకోవాలి. తరువాత మూత పెట్టి నూనె పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలి. అంతే పల్లీల మసాలా కూర తయారైనట్లే. దీనిని అన్నంతో పాటు కానీ చపాతీతో పాటు కానీ తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది.

 

Also Read : Papaya Benefits: బొప్పాయి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. తినకుండా అస్సలు ఉండలేరు?