Paneer Capsicum Curry: రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ క్యాప్సికం కర్రీ.. తయారీ విధానం?

ఈ రోజుల్లో క్యాప్సికం వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్యాప్సికం తో అనేక రకాల వంటలను తయారు చేయడంతో పాటు అనేక రకాల వంటకాలలో

  • Written By:
  • Publish Date - August 28, 2023 / 08:10 PM IST

ఈ రోజుల్లో క్యాప్సికం వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్యాప్సికం తో అనేక రకాల వంటలను తయారు చేయడంతో పాటు అనేక రకాల వంటకాలలో వీటిని వినియోగిస్తున్నారు. రెస్టారెంట్లలో అలాగే స్ట్రీట్ లో రకరకాల వెరైటీస్ తయారు చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా రెస్టారెంట్ స్టైల్ లో పన్నీర్ క్యాప్సికం కర్రీ తిన్నారా. ఎప్పుడు ట్రై చేయకపోతే ఇంట్లోనే పన్నీర్ క్యాప్సికం కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పన్నీర్ క్యాప్సికం కర్రీకి కావాల్సిన పదార్థాలు:

100 గ్రాముల పనీర్
2 క్యాప్సికం పెద్దవి
2 టమాటాలు
రెండు స్పూన్ల జీడిపప్పు
1 ఉల్లిపాయ పెద్దది
అర అంగుళం దాల్చిన చెక్క
2 లవంగాలు
2 యాలకులు
1 బిర్యానీ ఆకు
చిన్న అల్లం ముక్క
1 చెంచా గరం మసాలా పొడి
1 చెంచా కారం
1 చెంచా ధనియాల పొడి
1 చెంచా జీలకర్ర పొడి
కొద్దిగా కసూరీ మేతీ
సగం టీస్పూన్ పసుపు
3 టేబుల్ స్పూన్ల నూనె
కొద్దిగా కొత్తిమీర

పన్నీర్ క్యాప్సికం కర్రీ తయారీ విధానం:

ముందుగా మిక్సీలో టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం ముక్క, జీడిపప్పు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక కడాయిలో నూనె వేసుకుని కొంచెం వేడి కాగానే కారం వేసుకోవాలి. నూనెలో కారం కలిసిపోయేలా కలిపి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. అయిదు నిమిషాల పాటు నూనె పైకి తేలే వరకు ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. నూనె పైకి తేలితే పచ్చివాసన పోయినట్లే. ఇపుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇక అందులో అరగ్లాసు నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. రెండు నిమిషాలు ఉడికాక కాస్త పెద్దగా తరుగుకున్న పచ్చి క్యాప్సికం ముక్కల్ని వేసేసుకోవాలి. క్యాప్సికం ముక్కలు మగ్గిపోతాయి. దీంట్లో పనీర్ ముక్కలు కూడా వేసుకుని రెండు నిమిషాలయ్యాక కసూరీ మేతీ, కొత్తిమీర వేసుకుని దించుకుంటే చాలు. అంతే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ క్యాప్సికం కర్రీ రెడీ.