పనస(Panasa) తొనలు ఎండాకాలంలో మామిడితో పాటు దొరికే మరో ఒక ఫ్రూట్. పనస తొనల్లో కూడా మంచి పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మంచివి. పనస(Jack Fruit) తొనలను విడిగా గింజలు తీసేసి అందరూ తింటారు. వీటి గింజలను ఉడకబెట్టుకొని కూడా తింటారు. పనస పొట్టుతో కూర చేసుకుంటారు. పనస ఇర్యని కూడా ఈ మధ్య చేస్తున్నారు. అలాగే పనసతొనలతో హల్వా(Halwa) చేసుకుంటే కూడా ఎంతో రుచిగా ఉంటుంది.
పనస తొనల హల్వా తయారీకి కావలసిన పదార్థాలు:-
* పనస తొనలు రెండు కప్పులు
* కోవా నాలుగు చెంచాలు
* నెయ్యి అర కప్పు
* డ్రై ఫ్రూట్స్ అర కప్పు
* పంచదార నాలుగు స్పూన్లు
ముందు పనస తొనలు గింజలు తీసి, తొనలను మిక్సిలో మెత్తగా పట్టాలి. పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి దానిలో నెయ్యి వేసి దానిలో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. తరువాత ఆ మూకుడులో పనస తొనల గుజ్జును వేసి పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకోవాలి. కోవాను మెత్తగా మెదుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు పనస తొనల గుజ్జులో మెత్తగా మెదుపుకున్న కోవాను, పంచదారను వేసి మూకుడుకు అంటుకోకుండా ఉండేంతవరకు కలుపుతూ ఉండాలి. తరువాత మనం వేయించి ఉంచుకున్న డ్రైఫ్రూట్స్ ను వేసుకొని కలుపుకోవాలి. కొంచెం చిక్కగా అవ్వగానే తీసేస్తే పనస తొనల హల్వా రెడీ అయినట్లే. ఈ సమ్మర్ లో పనస హల్వా ట్రై చేసి చూడండి మరి.
Also Read : Sabudana: వేసవిలో సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?