Mango Peel Tea : మామిడి తొక్కలతో టీ తాగారా? ఎలా తయారు చేయాలంటే.. ప్రయాజనాలు..

మామిడిపండు తొక్కను పడేయకుండా దానితో టీ చేసుకొని తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది.

  • Written By:
  • Publish Date - May 4, 2024 / 01:22 PM IST

Mango Peel Tea : ఎండాకాలం(Summer) వచ్చింది కాబట్టి మనకు దొరికే మామిడిపండ్లను అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అదేవిధంగా మనం మామిడిపండు తొక్కను పడేయకుండా దానితో టీ చేసుకొని తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. మామిడిపండు తొక్కలను తీసుకొని వాటిని శుభ్రంగా కడగాలి. అనంతరం ఒక గిన్నెలో నీటిని తీసుకొని మామిడిపండు తొక్కలను ఆ నీటిలో వేయాలి. ఆ నీటిని బాగా మరిగించాలి. అప్పుడు రసం లాగా తయారవుతుంది. ఇది కొంచెం వగరుగా ఉంటుంది కాబట్టి దీనిలో కొద్దిగా తేనె కలుపుకొని తాగితే మంచిది. అంతే మామిడిపండు తొక్కలతో చేసిన టీ రెడీ.

అయితే మనకు ఎండాకాలంలో మాత్రమే మామిడిపండ్లు విరివిగా లభిస్తాయి కాబట్టి ఇప్పుడే ఆ పండు తొక్కలను బాగా ఎండబెట్టుకొని పొడి చేసుకొని ఉంచుకుంటే సంవత్సరం మొత్తం రోజూ ఆ పొడిని ఉపయోగించి టీ పెట్టుకొని తాగవచ్చు. బయట మార్కెట్ లో కూడా ఇప్పుడు ఈ మ్యాంగో పీల్ పొడి దొరుకుతుంది.

మామిడిపండు తొక్కలతో చేసిన టీ తాగడం వలన మనకు మలబద్దకం సమస్య రాకుండా ఉంటుంది. ఈ టీలో పాలీఫెనాల్స్, ఫ్లవనాయిడ్స్ మరియు విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ టీ తాగడం వలన రక్తంలో చక్కర శాతాన్ని తగ్గిస్తుంది కాబట్టి ఈ టీ డయాబెటిక్ పేషెంట్స్ కి మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ మామిడిపండు తొక్కలతో చేసిన టీ తాగడం వలన మనం ఎండాకాలంలో హైడ్రేట్ గా ఉంటాము. డీహైడ్రాషన్ కు గురి కాకుండా ఉంటాము. కాబట్టి మనం ఈ ఎండాకాలంలో మామిడిపండు తొక్కలతో చేసిన టీని తాగొచ్చు.

 

Also Read : Heat Wave: హీట్ వేవ్ అంటే ఏమిటి..? నివారించడానికి ఈ విషయాలపై శ్రద్ధ వ‌హించాలా..?