Mango Peel Face Mask : మామిడికాయ తొక్కలతో ఫేస్ మాస్క్ తెలుసా? ఎలా చేయాలి? ప్రయోజనాలేంటి?

మామిడిపండ్ల తొక్కలతో మన శరీరానికి ఫేస్ మాస్క్ తయారుచేసుకోవచ్చు.

  • Written By:
  • Publish Date - April 28, 2024 / 08:00 PM IST

Mango Peel Face Mask : ఎండాకాలం(Summer) రాగానే మామిడిపండ్లు వస్తాయి. మామిడిపండ్లు తినడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అదేవిధంగా మామిడిపండ్ల తొక్కలతో మన శరీరానికి ఫేస్ మాస్క్ తయారుచేసుకోవచ్చు. దీనివల్ల మన ఫేస్ కి కూడా ఎంతో మంచింది.

ముందుగా మామిడిపండ్ల తొక్కలను శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్నా వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. వాటిని మిక్సిలో వేసి మెత్తని గుజ్జులాగా తయారుచేసుకోవాలి. దీనికి ఒక స్పూన్ పెరుగు లేదా తేనె వేసి బాగా కలపాలి. ఆ తరువాత ఆ గుజ్జును ముఖానికి రాసుకొని ఒక పదిహేను నిముషాల పాటు ఉంచి తర్వాత చల్లని నీటితో కడుగుకోవాలి. తరువాత ఒక మెత్తని టవల్ తో ఫేస్ తుడుచుకోవాలి.

ఫేస్ మాస్క్ వేసుకుని శుభ్రం చేసుకున్న తరువాత మాయిశ్చరైజ్ చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు లేదా మూడు సార్లు చేస్తే మన చర్మం మెరుస్తూ ఉంటుంది. ఈ మాస్క్ వాడడం వలన మన శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా చర్మంకు తేమ అందుతుంది. ఈ మాస్క్ వాడడం వలన ఫేస్ మృదువుగా మరియు కాంతివంతంగా మారుతుంది. ఈ మాస్క్ వేసుకోవడం వలన ఫేస్ రిఫ్రెష్ గా ఉంటుంది. ఈ విధంగా మనం ఎండాకాలంలో మామిడిపండ్లను తినడమే కాకుండా మామిడి పండ్ల తొక్కలతో ఫేస్ మాస్క్ వేసుకోవచ్చు.

Also Read : Hirsutism: స్త్రీల ముఖంపై గ‌డ్డం, మీసాలు క‌నిపించ‌డానికి గ‌ల కార‌ణాలివే..?