Site icon HashtagU Telugu

Kandi Pachadi : ఇంట్లో సింపుల్‌గా కంది పచ్చడి తయారీ..

How to Prepare Kandi Pachadi in Home Simple Recipe

How to Prepare Kandi Pachadi in Home Simple Recipe

మనం రోజువారి ఆహారంలో అనేక రకాల పచ్చళ్ళు(Pickle) తింటాం. నిల్వ ఉండే పచ్చళ్ళు, ఎప్పటికప్పుడు చేసుకునే పచ్చళ్ళు.. బోలెడు ఉంటాయి. వీటిల్లో కంది పచ్చడి ఒకటి. కంది పచ్చడిని చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మన ఆరోగ్యానికి కూడా మంచిది.

కంది పచ్చడికి కావలసిన పదార్థాలు..

* కందిపప్పు ఒక కప్పు
* శనగపప్పు ఒక స్పూన్
* మినపపప్పు ఒక స్పూన్
* ఆవాలు ఒక స్పూన్
* జీలకర్ర ఒక స్పూన్
* మెంతులు ఒక స్పూన్
* ఎండుమిర్చి ఎనిమిది
* ఇంగువ కొద్దిగా
* ఉప్పు ఒక స్పూన్
* చింతపండు కొద్దిగా
* కొత్తిమీర ఒక కట్ట
* కరివేపాకు కొద్దిగా

పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి దానిలో నూనె లేకుండా కందిపప్పును దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తరువాత వాటిని తీసేసి పక్కన పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె వేసి మెంతులు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. అవి వేగిన తరువాత పక్కకు తీసి చల్లారబెట్టుకోవాలి. అవి చల్లారాక వాటిలో వేయించిన కందిపప్పు, ఉప్పు, చింతపండు, కొత్తిమీర వేసి మిక్సి పట్టుకోవాలి. మిక్సి పట్టేటప్పుడు కొన్ని నీళ్ళు పోయాలి అప్పుడు పచ్చడి మెత్తగా తయారవుతుంది.

అనంతరం ఒక గిన్నెలో కొద్దిగా నూనె వేసి కాగాక జీలకర్ర, సాయిపప్పు, ఆవాలు, ఇంగువ వేసుకొని తాలింపు వేయాలి. దానిని మెత్తగా నలిగిన కంది పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన కందిపచ్చడి(Kandi Pachadi) తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.