Site icon HashtagU Telugu

Kakarakaya Podi : నిల్వ ఉండే కాకరకాయ కారం పొడి ఎలా చేయాలో తెలుసుకోండి..

How to Prepare Kakarakaya Kaaram Podi Bitter Gourd Powder Simple Recipe

How to Prepare Kakarakaya Kaaram Podi Bitter Gourd Powder Simple Recipe

కాకరకాయ(Bitter Gourd) అంటేనే చేదుగా ఉంటుందని ఎక్కువ మంది తినరు. పిల్లలు అసలు తినరు. అయితే మన ఆరోగ్యానికి మేలు చేసే కాకరకాయలతో అనేక రకాల వంటలు చేసుకోవచ్చు. కాకరకాయ ఫ్రై, కాకరకాయ కూర, కాకరకాయ నిల్వ పచ్చడి, కాకరకాయ వెల్లుల్లి ఫ్రై.. ఇలా అనేక రకాలు చేసుకోవచ్చు. కాకరకాయతో కారం పొడిలా కూడా అచేసుకొని అన్నంలో కలుపుకొని తినొచ్చు. అలాగే అది ఎంతో రుచిగా ఉంటుంది. ఎక్కువ కాలం కూడా నిలువ ఉంచుకోవచ్చు.

కాకరకాయ కారం పొడి(Kakarakaya Kaaram Podi) తయారీకి కావలసిన పదార్థాలు..

* కాకరకాయ అర కేజీ
* ఎండుమిర్చి ఎనిమిది
* మినపపప్పు మూడు స్పూన్లు
* శనగపప్పు మూడు స్పూన్లు
* ధనియాలు నాలుగు స్పూన్లు
* కొత్తిమీర కొద్దిగా
* వెల్లుల్లిపాయ రెబ్బలు ఇరవై
* జీలకర్ర కొద్దిగా
* పసుపు కొద్దిగా
* చింతపండు ఇరవై గ్రాములు
* నూనె సరిపడా
* ఉప్పు తగినంత

కాకరకాయలు అన్నింటికీ పైన పొట్టు తీసి ఉంచుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దానిలో కొద్దిగా నూనె వేసుకొని ధనియాలు, శనగపప్పు, మినపపప్పు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తరువాత తీసి పక్కకు పెట్టుకోవాలి. అదే గిన్నెలో ఎండుమిర్చి వేసి వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే గిన్నెలో కాకరకాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక మిక్సి గిన్నెలో మినప పప్పు, శనగపప్పు, ధనియాలు వేసి మిక్సి పట్టుకోవాలి. తరువాత జీలకర్ర, ఉప్పు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి మిక్సి పట్టుకోవాలి. ఇప్పుడు మనం వేపుకున్న కాకరకాయ ముక్కలను కూడా అందులోనే వేసి మిక్సి పట్టుకోవాలి. అంతే కాకరకాయ కారం పొడి రెడీ.

ఇలా చేసుకున్న కాకరకాయ కారం పొడిని ఒక డబ్బాలో ఉంచుకొని నిలువ ఉంచుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న కాకరకాయ కారం రెండు వారాల వరకు నిలువ ఉంటుంది. అన్నంలో కలుపుకోవచ్చు, ఇడ్లితో పాటు తినొచ్చు.

Also Read : Vegetable Jonna Sangati : వెజిటేబుల్ జొన్న సంగటి ఎలా చేయాలి? ఆరోగ్యానికి ఎంతో మంచిది.