కరివేపాకు(Karivepaku)తో మనం పొడి లేదా అన్ని తాలింపులలో, కూరల్లో వేసుకుంటూ ఉంటాము. అలాగే కరివేపాకు(Curry Leaves)తో పచ్చడి తయారుచేసుకొని దానిని టిఫిన్స్ కు లేదా అన్నంలో కలుపుకొని తినవచ్చు. ఇది రుచిగా ఉంటుంది. ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.
కరివేపాకు పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు..
* కరివేపాకు ఆకులు రెండు కప్పులు
* ఎండుమిర్చి పది
* చింతపండు 50 గ్రాములు
* ఉప్పు తగినంత
* పచ్చి కొబ్బరి తురుము పావు కప్పు
* నువ్వులు ఒక స్పూన్
* మినపగుళ్ళు ఒక స్పూన్
* బెల్లం ఒక స్పూన్
ఒక చిన్న మూకుడులో కొద్దిగా నూనె వేసి నూనె కాగిన తరువాత మినపగుళ్ళు, ఎండుమిర్చి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత దానిలో నువ్వులు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత కరివేపాకు, చింతపండు, సరిపడ ఉప్పు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తరువాత దానిని దించుకొని దానిలో పచ్చి కొబ్బరి తురుము వేసి కలబెట్టాలి. కరివేపాకు మిశ్రమంకు వేయించిన అన్ని పదార్థాలు కలుపుకొని దానిలో బెల్లం వేసి మెత్తగా మిక్సీ పడితే కరివేపాకు పచ్చడి తయారవుతుంది. ఇలా తయారుచేసిన కరివేపాకు పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. దీనిని మనం టిఫిన్లకు లేకపోతే అన్నంతో పాటు తినవచ్చు.
Also Read : Tomato Pulao: ఇంట్లోనే ఎంతో టేస్టీగా టొమాటో పులావ్ తయారు చేసుకోండిలా?