Site icon HashtagU Telugu

Coriander Rice : కొత్తిమీర రైస్.. సింపుల్ గా ఇంట్లో ఎలా తయారుచేయాలో తెలుసా..?

how to prepare Coriander Rice in home simple and tasty way

how to prepare Coriander Rice in home simple and tasty way

కొత్తిమీర(Coriander)ను మనం అన్ని రకాల కూరల్లో, సాంబార్ లలో వేసుకుంటాము. కొత్తిమీరతో పచ్చడి కూడా చేసుకోవచ్చు. అలాగే కొత్తిమీరతో రైస్ చేసుకుంటే అది ఎంతో రుచిగా ఉంటుంది.

కొత్తిమీర రైస్(Coriander Rice) తయారీకి కావలసిన పదార్థాలు..

* కొత్తిమీర కట్ట ఒకటి తరిగినది
* పావుకిలో బియ్యంతో వండిన అన్నం
* టమాటాలు పెద్దది ఒకటి
* పచ్చిమిర్చి ఆరు
* నూనె రెండు స్పూన్లు
* ఉప్పు తగినంత
* జీడిపప్పు కొద్దిగా
* వెల్లుల్లిపాయలు పది
* ఉల్లిపాయలు పెద్దది ఒకటి
* లవంగాలు నాలుగు
* దాల్చినచెక్క కొద్దిగ
* అల్లంవెల్లుల్లి పేస్ట్ కొద్దిగ
* బిర్యానీ ఆకులు రెండు
* యాలకులు మూడు
* అనాసపువ్వు ఒకటి

కొత్తిమీర రైస్ తయారు చేయు విధానం..

ముందు ఒక కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసినాక పచ్చిమిర్చి, టమాటాలు వేసి కాగనివ్వాలి. తరువాత కొత్తిమీర వేసి వేగనివ్వాలి. దీనిపై మూత పెట్టి టమాటాలు, కొత్తిమీర మగ్గనివ్వాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తరువాత వీటిని మిక్సి జార్ లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేయాలి.

ఇంకొక కడాయి తీసుకొని దానిలో నూనె వేసి కాగిన తరువాత మసాలాదినుసులు(బిర్యానీ ఆకులు, యాలకులు, అనాసపువ్వు..) వేసి వేయించాలి. తరువాత జీడిపప్పు, ఉల్లి పాయలు, వెల్లుల్లి వేసి కాగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తరువాత కొత్తిమీర పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంతవరకు వేయించాలి. తరువాత ఉప్పు వేసి కలపాలి. కాసేపు వేగనిచ్చిన తరువాత అన్నం వేసి బాగా కలపాలి. తరువాత మరో ఐదు నిముషాలకు స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా కొత్తిమీర రైస్ సింపుల్ గా చేసుకోవచ్చు.

ఇంకో విధంగా.. అన్ని వేగిన తర్వాత, కొత్తిమీర పేస్ట్ వేసి అన్నం బదులు రైస్ వేసి నీళ్లు పోసి అన్నంలా అయ్యేవరకు ఉడికించాలి. అయితే దీనికి ఎక్కువ సమయం పడుతుంది. కొత్తిమీర రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక దీనికి రైతాతో, ఉల్లిపాయలతో తింటే చాలా రుచిగా ఉంటుంది.

 

Also Read : Chicken Potato Kurma: ఎంతో రుచిగా ఉండే చికెన్ పొటాటో కుర్మా.. తయారీ విధానం?