పచ్చి కొబ్బరి(Coconut)ని మనం తింటూ ఉంటాము ఇంకా కొన్ని రకాల వంటకాలలో వాడుతుంటాము. పచ్చి కొబ్బరితో పచ్చడి, పులుసు, కూర.. ఇంకా స్వీట్ కూడా చేసుకోవచ్చు. పచ్చికొబ్బరితో కోకోనట్ బర్ఫీ(Coconut Burfi)మన ఇంటిలోనే తొందరగా తయారుచేసుకోవచ్చు. దీనిని పదిహేను లేదా ఇరవై నిముషాలలో తయారుచేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది.
కోకోనట్ బర్ఫీ తయారీకి కావలసిన పదార్థాలు..
* జీడిపప్పులు కొన్ని
* ఒక కొబ్బరికాయ
* పంచదార అర కప్పు
* యాలకుల పొడి అర స్పూన్
* నెయ్యి కొద్దిగా
*బాదంపప్పులు కొన్ని
కోకోనట్ బర్ఫీ తయారుచేసే విధానం..
కొబ్బరికాయను ముక్కలుగా చేసుకొని మిక్సి పట్టుకోవాలి. ఒక మూకుడులో కొద్దిగ నెయ్యి వేసి దానిలో మిక్సి పట్టిన కొబ్బరిని వేయించుకోవాలి. కొబ్బరి పొడి పొడిగా రంగు మారేంతవరకు వేయించుకోవాలి. తరువాత యాలకుల పొడి, పంచదార వేసి కలపాలి అప్పుడు అది పలుచగా అవుతుంది. అది దగ్గరగా అయ్యేంతవరకు కలుపుతూ ఉండాలి. ఒక ప్లేటుకి నెయ్యి రాసి ఉంచాలి. దగ్గరగా అయిన తరువాత ఆ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేటులో వెయ్యాలి. కొద్దిగా నెయ్యిలో కొన్ని జీడిపప్పులను, బాదంపప్పులను ముక్కలుగా చేసి వేయించుకొని వాటిని అంతకుముందు చేసుకున్న మిశ్రమం పైన చల్లుకోవాలి. అది పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తరువాత మనకు నచ్చిన షేప్స్ లో కట్ చేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
Also Read : Maggi Vada: వెరైటీగా మ్యాగీ వడ.. ట్రై చేయండిలా?