Carrot Egg Ponganalu: ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పొంగనాలు.. తయారీ విధానం?

మాములుగా పొంగనాలు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది దోశ పిండితో చేసే గుంతపొంగనాలు. ఇప్పుడు ఒకటే రకమైన గుంతపొంగనాలు కాకుండా చాలామంది వీటిల

  • Written By:
  • Publish Date - July 16, 2023 / 09:30 PM IST

మాములుగా పొంగనాలు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది దోశ పిండితో చేసే గుంతపొంగనాలు. ఇప్పుడు ఒకటే రకమైన గుంతపొంగనాలు కాకుండా చాలామంది వీటిలోనే వెరైటీ వెరైటీగా ట్రై చేస్తూ తింటూ ఉంటారు. కొంతమంది అటుకులతో వెరైటీగా గుంతపొంగనాలు చేస్తే మరి కొంతమంది సజ్జలతో గుంతపొంగనాలు చేస్తూ ఉంటారు. సగ్గుబియ్యం పొంగనాలు, జొన్నపిండి పొంగనాలు, రాగులతో పొంగనాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల పొంగనాలు ఉన్నాయి. ఇందులో చాలామంది రెండు మూడు రకాల పొంగనాలు మాత్రమే తిని ఉంటారు. అయితే ఎప్పుడైనా మీరు క్యారెట్ ఎగ్ పొంగనాలు తిన్నారా. వినడానికి కాస్త డిఫరెంట్ గా ఉన్న ఈ క్యారెట్ ఎగ్ పొంగనాలు తినడానికి ఎంతో రుచిగా టేస్టీగా ఉంటాయి. మరి ఈ క్యారెట్ ఎగ్ పొంగనాలు ఎలా తయారు చేయాలి? అందుకు ఏ ఏ పదార్థాలు కావాలి. అన్న వివరాల్లోకి వెళితే..

క్యారెట్ ఎగ్ పొంగనాలకు కావలసిన పదార్థాలు

క్యారెట్‌ – రెండు,
ఎగ్స్‌ – నాలుగు,
క్యాప్సికమ్‌ – ఒక కప్పు
టమాటా – ఒక కప్పు
ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు
వెల్లుల్లి – రెండు రెబ్బలు
వెన్న – రెండు టేబుల్‌ స్పూన్లు
ఉప్పు – తగినంత
కారం – ఒక టీస్పూన్‌
మిరియాలపొడి – తగినంత

క్యారెట్ ఎగ్ పొంగనాల తయారీ విధానం

ఇందుకోసం ముందుగా ఒక పాత్ర తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేయాలి. అది వేడయ్యాక వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ, క్యారెట్‌, క్యాప్సికమ్‌, టమాటా ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు కలిపి, బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన మిశ్రమంలో గుడ్లు, కారం, తగినంత ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్‌మీద పొంగనాల ప్లేట్‌ పెట్టుకుని వెన్న వేసి, వేడయ్యాక మిశ్రమాన్ని గుంతల్లో పోసుకుని రెండువైపులా కాల్చుకుంటే సరి. క్యారెట్‌ ఎగ్‌ పొంగనాలు సిద్ధం. ఇందులోకి టమోటా చట్నీ, ఎర్ర కారం, లేదంటే పల్లి చట్నీ ఎంతో టేస్టీగా ఉంటుంది.