Site icon HashtagU Telugu

Cabbage Pakodi : క్యాబేజి పకోడీ ఇంట్లోనే సింపుల్ గా ఇలా తయారు చేసుకోండి..

How to Prepare Cabbage Pakodi in Home simple recipe

How to Prepare Cabbage Pakodi in Home simple recipe

పకోడీలు ఉల్లిపాయతోనే (Onions) కాక ఇటీవల అనేక రకాల కూరగాయల (Vegetables) తో కూడా చేసుకుంటున్నారు. నాన్ వెజ్ పకోడీలు కూడా చేస్తున్నారు. రకరకాల పకోడీలలో క్యాబేజి పకోడీ (Cabbage Pakodi) ఒకటి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దానిని బయట కొనుక్కొని తినడం కంటే కూడా మనం ఇంటిలో తయారుచేసుకొని తింటే ఇంకా రుచిగా ఉంటాయి.

క్యాబేజి పకోడీకి కావలసిన పదార్థాలు..

* క్యాబేజి తురుము 300 గ్రాములు
* శనగపిండి 150 గ్రాములు
* బియ్యంపిండి రెండు స్పూన్లు
* ఉల్లిపాయలు రెండు సన్నగా తరిగినవి
* పచ్చిమిర్చి రెండు సన్నగా తరిగినవి
* కారం పొడి స్పూన్
* అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్
* జీలకర్ర కొద్దిగ
* గరం మసాలా కొద్దిగ
* ధనియాల పొడి కొద్దిగ
* ఉప్పు రుచికి తగినంత
* కరివేపాకు కొద్దిగ
* కొత్తిమీర కొద్దిగ
* నీరు తగినంత
* నూనె తగినంత

క్యాబేజి పకోడీ తయారు చేయు విధానం..

క్యాబేజి తురుము, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర అన్నింటిని ఒక పెద్ద గిన్నెలో నీరు పోయకుండా కలుపుకోవాలి. తరువాత శనగపిండి, బియ్యంపిండి ని కొద్ది కొద్దిగా నీటిని చిలకరిస్తూ కలుపుకోవాలి. పొయ్యి మీద మూకుడులో నూనెను ఉంచి కాగనివ్వాలి. నూనె కాగిన తరువాత మనం కలిపి ఉంచుకున్న పిండిని పకోడీలా వేసి చిన్న మంట మీద వేగనివ్వాలి. రంగు మారిన తరువాత ఒక నిముషం పెద్ద మంట మీద ఉంచి తరువాత తీసెయ్యాలి. చివరకు కరివేపాకును లైట్ గా వేయించి మనం రెడీ చేసుకున్న క్యాబేజి పకోడీ మీద వేసుకోవాలి. అంతే వేడి వేడిగా కరకరలాడే ఎంతో రుచికరమైన క్యాబేజి పకోడీ రెడీ. దీనికి టమాటా సాస్, చిల్లీ సాస్, పెరుగు, చట్నీల కాంబినేషన్ తో కలిపి తినొచ్చు.

 

Also Read : Oats Walnut Cutlets: ఎంతో రుచిగా ఉండే ఓట్స్ వాల్ నట్స్ కట్లెట్.. తయారు చేసుకోండిలా?