Badam Milk : మండు వేసవిలో..చల్లచల్లని బాదంమిల్క్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..

ఈ బాదంపాలు రెసిపీలో మనం బాదంపప్పు, జీడిపప్పులను వాడాం. పంచదార తక్కవగా యూజ్ చేశాం. బాదం, జీడిపప్పు శరీరానికి కావలసిన ఆరోగ్యకరమైన కొవ్వుల్ని అందిస్తాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. బరువును తగ్గించడంలోనూ బెస్ట్. బాదంపప్పు రోజూ తింటే మెదడు ఆరోగ్యం బాగుంటుంది.

  • Written By:
  • Publish Date - March 13, 2024 / 10:41 AM IST

Badam Milk Recipe : ఎండాకాలం మొదలైంది. ఇక తిండి మీద ధ్యాస ఉండదు. మండుటెండకు ఎప్పుడూ ఏదైనా చల్లగా తాగాలనిపిస్తూ ఉంటుంది. కానీ.. రోజూ చల్లటివి తాగితే దాని ఎఫెక్ట్ ముందు ముందు తప్పకుండా కనిపిస్తుంది. రోజూ కాకుండా.. అప్పుడప్పుడూ ఇంట్లో తయారు చేసిన ద్రవపదార్థాలు తీసుకోవడం, నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లు తినడం మంచిది. బాదంమిల్క్ కూడా తాగొచ్చు. అంటే బయట బాదంపొడి కొనుక్కొచ్చి.. పాలల్లో కలుపుకుని తాగడం కాదు. తయారు చేసే పద్ధతిలో చేస్తే.. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. ఇన్ స్టంట్ ఎనర్జీ వస్తుంది. పెద్దలకు కూడా ఇది ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. మరి ఇంట్లోనే బాదంపాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

బాదంపాలు రెసిపీకి కావలసిన పదార్థాలు

బాదంపప్పులు – 1 కప్పు

జీడిపప్పు – 1 కప్పు

పంచదార – 100 గ్రాములు

యాలకుల పొడి – 1/2స్పూన్

పాలు – 1/2 లీటర్

బాదంపాలు తయారీ విధానం

ముందుగా బాదంపప్పు, జీడిపప్పును మిక్సీలో వేసి మెత్తటి పొడిగా చేసుకోవాలి. దీనిని పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో వెన్న తీయని పాలను పోసి మరిగేలా కాచుకోవాలి. అందులో యాలకులపొడి, పంచదార వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా పొడిచేసి ఉంచుకున్న బాదం, జీడిపప్పు పొడిని పాలల్లో వేసి చిన్న మంటపై 10 నిమిషాలపాటు మరగనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటిని చల్లారనివ్వాలి.

ఇప్పుడీ బాదంపాలను గ్లాసుల్లో పోసి.. పైన సన్నగా తరిగిన బాదం, జీడిపప్పులు వేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి బాదంపాలు తాగితే.. ఆ రుచే వేరు. రోజూ ఇలా బాదంపాలను తయారు చేసి పిల్లలకు తాగిస్తే.. ఆరోగ్యంగా ఉంటారు. ఇతర రసాయనాలతో కూడిన డ్రింక్స్ కు దూరంగా ఉంటారు.

ఈ బాదంపాలు రెసిపీలో మనం బాదంపప్పు, జీడిపప్పులను వాడాం. పంచదార తక్కవగా యూజ్ చేశాం. బాదం, జీడిపప్పు శరీరానికి కావలసిన ఆరోగ్యకరమైన కొవ్వుల్ని అందిస్తాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. బరువును తగ్గించడంలోనూ బెస్ట్. బాదంపప్పు రోజూ తింటే మెదడు ఆరోగ్యం బాగుంటుంది. ఇక పాలు.. శరీరానికి కాల్షియాన్ని అందిస్తాయి. అలాగే పిల్లలకు శక్తినిస్తాయి. ఏకాగ్రతతో చదివేలా చేస్తుంది. బాదం, జీడిపప్పు, పాలు.. పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది.

Also Read : Papaya And Pomegranate: బొప్పాయి, దానిమ్మ పండ్లు కలిపి తింటున్నారా.. అయితే ఇది మీ కోసమే?