Summer Jewellery: వేసవిలో ఎలాంటి జ్యువెలరీ వేసుకోవాలో తెలియక ఆలోచిస్తున్నారా.. అయితే ఇది మీకోసమే?

సమ్మర్ మొదలయింది అంటే చాలు అధిక చెమట కారణంగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక పక్క వేడి గాలులు ఇంకా చికాకు తెప్పిస్తాయి. అలానే తిండి కూడా నోట్లో

  • Written By:
  • Updated On - February 23, 2024 / 09:36 PM IST

సమ్మర్ మొదలయింది అంటే చాలు అధిక చెమట కారణంగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక పక్క వేడి గాలులు ఇంకా చికాకు తెప్పిస్తాయి. అలానే తిండి కూడా నోట్లోకి వెళ్ళదు. ఏదైనా డ్రింక్స్ మాత్రమే తీసుకుంటాం. కొద్దిగా ఆహారం తీసుకోవడం మాత్రమే చేస్తూ ఉంటాము. అయితే అటువంటి సమయం లో పెళ్లిళ్లు జరిగితే నిజంగా పెద్ద చిక్కే వస్తుంది ఒక వేళ మీరు పెళ్లి కూతురు లేదా పెళ్లికి వెళ్లి గెస్ట్ అయితే తప్పకుండా ఈ జ్యువెలరీ చిట్కాలను పాటించాల్సిందే. ముఖ్యంగా పెళ్లికూతురు ఎక్కువ మొత్తంలో ఆభరణాలను, ఖరీదైన బట్టలను ధరించాల్సి వస్తూ ఉంటుంది. వేసవిలో ఈ జ్యువెలరీ ప్రిఫర్ చేయడం వల్ల మీరు హ్యాపీగా ఉండవచ్చు. పైగా ఇవి లైట్ గా ఉంటాయి. మీకు వేసుకోవడానికి పెద్ద కష్టంగా కూడా ఉండదు.అందుకనే మీరు వీటి మీద కాస్త దృష్టి పెట్టండి. వీటిని పెళ్ళిళ్ళకి వేసుకోవడం వల్ల మీరు అందంగా కనబడటం మాత్రమే కాకుండా తేలికగా ఉంటాయి.

ఈ జ్యువెలరీ బాక్స్ చూశారంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ మోడల్స్ తక్కువ బరువుతో నిజంగా అందరినీ ఆకర్షిస్తున్నాయి.
సమ్మర్‌లో ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు జ్యువెలరీ విషయంలో ఇబ్బంది పడకుండా ఉండాలంటే వీటిని అనుసరిస్తే మరింత అందంగా కనిపిస్తారు. ఎనామిల్ ఝుంకి ఇయర్ రింగ్స్.. విటమిన్ చూసారంటే అవాక్కు అవ్వాల్సిందే. ప్రతి వెడ్డింగ్ అవుట్ ఫిట్ మీద జూలరీ తప్పక ఉండాలి. ముఖ్యంగా ఇయర్ రింగ్స్ ప్రధానంగా అందరినీ ఆకర్షిస్తూ ఉంటాయి. పైగా ప్రతి ఒక్కరి దృష్టి దీని మీద వెళుతుంది. కనుక మీరు ఈ జుంకీస్ ని ప్రిఫర్ చేస్తే తప్పకుండా అందరూ ఆ ఇయర్ రింగ్స్ మీద చూపు తిప్పుకోకుండా ఉంటారు. చెప్పాలంటే మీరు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయిపోతారు. ఈ జుంకీస్ సాధారణమైనవి కాదు బరువు కూడా తక్కువ గానే ఉంటాయి.

మీరు రోజంతా డాన్స్ చేసిన అవి కిందకి జారిపోవు. పైగా ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. మీరు కనుక మీ పెళ్ళికి పెట్టుకోవాలన్నా లేదా ఎవరైనా పెళ్లికి వెళ్తున్న తప్పకుండా వెంటనే ప్రిఫర్ చేయండి. లెహంగా, షరారా మీదకి బాగా సెట్ అవుతాయి సంగీత్ లాంటి ముఖ్యమైన కార్యక్రమాల్లో తప్పకుండా వీటిని ధరించాల్సిందే. కాబట్టి ఒకసారి వీటి మీద ఒక లుక్ వేయాలి. నిజంగా మీరు కూడా టెంప్ట్ అయిపోతారు. ఎంతో అందంగా చిన్న చిన్న స్టోన్స్ వేలాడుతూ ఎంతో అద్భుతంగా దీన్ని డిజైన్ చేశారు. పెళ్లికి నిజంగా ఇది బాగా సూట్ అవుతాయి. మీరు వేరే ఛాయిస్ కి వెళ్ళక్కర్లేదు కూడా. హెవీ లెహంగా షరారా మీదకి వీటిని వేసుకుంటే చాలా బాగుంటుంది. పైగా ఫొటోస్ లో కూడా అద్భుతంగా పడతాయి. కనుక తప్పక వీటిని ప్రిఫర్ చేయాల్సిందే. ఇయర్ రింగ్స్ కాస్త ట్రెడిషనల్ గా మరియు కొంచెం ఫాన్సీ గా ఉంటాయి. అనార్కలి సూట్ మీదకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి. అలానే ఏ కాస్ట్యూమ్ అయినా కూడా బాగుంటాయి. నిజంగా చూస్తే మీరు దీని నుంచి చూపు తిప్పుకోవడం కష్టమనే చెప్పాలి. సాధారణంగా డైమండ్స్ ని అందరూ ఇష్ట పడుతూ ఉంటారు.

అందులోనీ చాంద్బాలి వేరే లెవెల్ అనే చెప్పాలి. ఏ అకేషన్ అయినా ఏ అవుట్ ఫిట్ అయినా ఇట్టే సూట్ అయి పోతాయి. వీటిని ధరించి మీ ఫంక్షన్ లో లేదా ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినా కూడా మీరు మరింత అందంగా కనిపిస్తారు. పైగా దీని మీద పొగడ్తలు వస్తూనే ఉంటాయి. చాలా మంది జువెలరీ విషయం లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అబ్బా ఇది బాగుందా లేదా అది బాగుందా అని నిర్ణయం కూడా తీసుకో లేక పోతారు. కానీ మీరు ట్రెడిషనల్ కుందన్ మీనా నెక్లెస్ సెట్ ని చూశారంటే మరో ఆప్షన్ కి వెళ్లక్కర్లేదు. అయితే సమ్మర్ లో చాలా బాగుంటుంది నిజంగా ఈ నెక్లెస్ హైలెట్ అయి పోతుంది. అయితే సమ్మర్లో ఎటువంటి ఆభరణాలు ధరించినా కూడా వెయిట్ లెస్ అలాగే తక్కువ ఆభరణాలు ధరించడం మంచిది.