మామూలుగా తమలపాకును మనం తాంబూలం గా అలాగే పాన్, కీల్లీ వంటి వాటికి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాం. ఇక తమలపాకు ను ఉపయోగించి చాలా తక్కువ వంటలు చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా మీరు తమలపాకు బజ్జీలు తిన్నారా. వినడానికి కాస్త వెరైటీగా, వింటుంటూనే నోరూరిస్తున్న ఈ రెమిడిని ఇంట్లోనే సింపుల్ గా ఏ విధంగా తయారు చేసుకోవాలి. అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తమలపాకు బజ్జీలకూడా కావాల్సిన పదార్థాలు:
తమలపాకులు – 10
శనగపిండి – 1/4కేజీ
ఉప్పు – రుచికి సరిపడా
వాము – సరిపడా
స్పూన్ కారం – అర స్పూన్
వంటసోడా – చిటికెడు
నూనె – సరిపడా
ఉల్లిపాయ- 1
చాటింగ్ మసాలా – చిటికెడు
నిమ్మకాయ – 1
తమలపాకు బజ్జీలు తయారీ విధానం:
ఇందుకోసం ముందుగా తమలపాకును తీసుకుని వాటిని బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో శనగపిండి, కారం, సోడా, వాము, నీరు వేసి బజ్జీ పిండి వలే కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకునేందుకు ఒక కడాయి తీసుకుని అందులో నూనె పోసి వేడి చేయాలి. ముందుగా ఆరబెట్టుకున్న తమలపాకులు తీసుకుని ఒక్కొక్కటిగా బజ్జీ పిండిలో రెండు వైపులా ముంచి నూనెలో వేయాలి. ఎర్రగా రెండు వైపులా వేగనివ్వాలి. తర్వాత బయటకు తీసి ఒక ఉల్లిపాయను తీసుకుని సన్నగా కట్ చేసుకుని కాస్త కారం, చాట్ మసాలా , ఉప్పు ,నిమ్మకాయ వేసుకుని బజ్జీ మధ్యలో కట్ చేసి పెట్టండి. మిగిలిన తమలపాకులను కూడా ఇదే మాదిరిగా చేస్తే చలికాలంలో వేడివేడిగా ఉండే తమలపాకు బజ్జీలు రెడీ.