Atukula Pulihora: ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పులిహోర.. ఇంట్లోనే ట్రై చేయండిలా?

చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా పులిహోరను ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే పులిహోరలో కూడా కొన్ని రకాల పులిహోరలు ఉ

  • Written By:
  • Publish Date - March 22, 2024 / 09:37 PM IST

చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా పులిహోరను ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే పులిహోరలో కూడా కొన్ని రకాల పులిహోరలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడైనా మీరు అటుకుల పులిహోర తిన్నారా. తినకపోతే ఈ రెసిపీ ని సింపుల్ గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు:

ఒక కప్పు అటుకులు, కరివేపాకు రెండు రెమ్మలు, కాస్త కొత్తిమీర, రెండు నిమ్మకాయలు లేదా 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, తగినంత ఉప్పు, కొన్ని వెల్లులి, అల్లం ముక్కలు, పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ జీలకర్ర, మూడు మిర్చీలు,2 టేబుల్ స్పూన్ల వేరుశెనగలు లేదా పల్లీలు తగిన మోతాదులో తీసుకోవాలి.

తయారీ విధానం:

ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకుని నీటిలో నానబెట్టండి. ఆ తర్వాత వాటిని వడపోసి పక్కన పెట్టండి. ఎక్కువ తడి లేకుండా పొడి బారకుండా ఉండేలా అటుకులు ఉండాలి. ఎక్కువ తడిగా ఉంటే వేడి చేసేప్పుడు మెత్తగా అయిపోతాయి. మరోవైపు స్టవ్ మీద పెనం పెట్టి, కాస్త ఆయిల్ వేసి అందులో వెల్లులి, అల్లం ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, వేరుశెనగ పల్లీలను సన్నని మంటపై దోరగా వేయించుకోవాలి. కాస్త పసుపు వేసిన తర్వాత పక్కన పెట్టుకున్న అటుకులను పెనంలో వేసి బాగా కలపాలి. అది స్టవ్ మీద వేడెక్కుతున్న సమయంలో నిమ్మరసాన్ని తీసుకోవాలి. అందులో తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ రసాన్ని పెనం మీద ఉన్న అటుకుల్లో వేస్తే ఎంతో టేస్టీగా అటుకుల పులిహోర రెడీ.