Site icon HashtagU Telugu

Onion Oil: జుట్టు చక్కగా ఒత్తుగా పెరగాలా.. అయితే ఉల్లిరసంతో ఈ విధంగా చేయాల్సిందే!

Onion Oil

Onion Oil

ప్రస్తుత రోజుల్లో చాలామంది జుట్టు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో హెయిర్ ఫాల్ అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. పని ఒత్తిడి కాలుష్యం ఆహార మార్పులు ఇలా అనేక రకాల కారణాల వల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. వీటిలో జుట్టు రాలిపోవడం హెయిర్ ఫాల్ సమస్య పెద్ద సమస్యగా మారిపోయింది. హెయిర్ ఫాల్ సమస్యను అరికట్టడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల షాంపులను ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకొందరు ఆయిల్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయినా కూడా మంచి ఫలితాలు కనిపించవు. మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఏం చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇందుకోసం కొన్ని రకాల పదార్థాలు కావాలి. కొబ్బరినూనె అరకప్పు, కరివేపాకు 20 రెబ్బలు, మెంతులు ఒక టేబుల్ స్పూన్, మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి. వీటన్నిటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మీడియం సైజ్​ ఉల్లిపాయ ఒకటి తీసుకోవాలి. ఒకవేళ మీడియం సైజ్​ లేకపోతే చిన్నవి రెండు తీసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయ పొట్టు తీసి సన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టౌ ఆన్​ చేసిన ఓకే మందపాటి పాత్ర పెట్టి అందులో పైన చెప్పిన విధంగా కొబ్బరినూనె, మెంతులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఆ మిశ్రమాన్ని మీడియం మంట మీద సుమారు అరగంట పాటు మరగించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉల్లి, మెంతులు, కరివేపాకులో ఉన్న పోషకాలన్నీ నూనెలోకి చేరతాయి.
నూనె మరిగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లారే వరకు పక్కన పెట్టాలి.

ఆపై ఒక శుభ్రమైన క్లాత్ సహాయంతో ఆ నూనెను వడకట్టుకోవాలి. అనంతరం దాన్ని ఒక గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకొని కావాల్సినప్పుడు ఉపయోగించుకోవచ్చు. నేను నిన్ను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టుకు సంబంధించిన చాలా రకాల సమస్యలు తగ్గుముఖం పడతాయి. అయితే ఈ ఉల్లి నూనె అప్లై చేయడం వల్ల ఇంకా ఇలాంటి ఫలితాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే.. ఈ నూనె తయారీలో ఉపయోగించే కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు కావాల్సిన తేమను అందించి నేచురల్​ మాయిశ్చరైజర్‌ లా పనిచేస్తాయి. అలాగే ఇందులోని ప్రొటీన్లు జుట్టుకు పటుత్వాన్ని అందిస్తాయి. కొబ్బరి నూనె వాతావరణ కాలుష్య ప్రభావం కురులపై పడకుండా రక్షణ కలిగిస్తుందట. కుదుళ్లకు బలాన్ని అందించి జుట్టు చివర్లు చిట్లిపోకుండా కాపాడుతుందని చెబుతున్నారు. మెంతుల్లో ఉండే ప్రొటీన్‌, నికోటినిక్‌ యాసిడ్‌ చుండ్రు సమస్యను తగ్గించడంలో బాగా సహాయపడతాయని అంటున్నారు. చివరగా ఉల్లిపాయలో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట. ముఖ్యంగా ఉల్లిలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్​ఫ్లమేటరీ గుణాలు జుట్టు సమస్యలను దూరం చేయడంలో చాలా ఎఫెక్టివ్​ గా పనిచేస్తాయని చెబుతున్నారు. ఇవన్నీ జుట్టు రాలడాన్ని అరికట్టి హెయిర్ ఒత్తుగా, బలంగా, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉల్లి నూనె జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను పెంచుతుందట.