Onion Hair Oil: నేడు ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ చాలా మంది జుట్టు టెన్షన్ లేదా డిప్రెషన్ కారణంగా రాలిపోతోంది. మీకు కూడా జుట్టు రాలే సమస్య ఉంటే ఉల్లిపాయ నూనె (Onion Hair Oil) మీ సమస్యను పరిష్కరించగలదు. ఉల్లిపాయ నూనెను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చు. జుట్టుకు అప్లై చేయడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
ఒక్కసారి జుట్టు రాలడం ప్రారంభిస్తే దాన్ని ఆపడం చాలా కష్టం. ఖరీదైన ఉత్పత్తులు కూడా జుట్టు రాలడాన్ని ఆపలేవు. ఇటువంటి పరిస్థితిలో జుట్టు రాలడాన్ని నివారించడానికి మీరు ఇంట్లో ఉల్లిపాయ నూనెను తయారు చేసి ఉపయోగించవచ్చు. ఉల్లిపాయ రసాన్ని అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది. కొత్త జుట్టు పెరుగుతుంది. ఉల్లిపాయ నూనె తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం.
Also Read: Vijayawada Floods : వామ్మో ..విజయవాడ లో లీటరు వాటర్ బాటిల్ రూ.100, పాలు రూ.150
ఉల్లిపాయ నూనె చేయడానికి కావలసిన పదార్థాలు
– ఒకటి లేదా రెండు పెద్ద ఉల్లిపాయలు
– 200 గ్రాముల కొబ్బరి నూనె
– ఒక కప్పు కరివేపాకు
ఉల్లిపాయ హెయిర్ ఆయిల్ ను ఇలా సిద్ధం చేసుకోండి
జుట్టు రాలడాన్ని నివారించడానికి ఈ నూనెను తయారు చేయడం చాలా సులభం. దీని కోసం ఉల్లిపాయను సన్నగా తరిగి, ఒక కప్పు కరివేపాకు తీసుకోండి. బాణలిలో కొబ్బరి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో కరివేపాకు, ఉల్లిపాయ కలపాలి. దీన్ని బాగా వేయించి తర్వాత ఒక పాత్రలో తీసి చల్లార్చాలి. దీన్ని నిల్వ చేసి జుట్టుకు పట్టించాలి.
ఉల్లిపాయ నూనెను అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు
ఉల్లిపాయలో జుట్టు పెరుగుదలను వేగవంతం చేసే ఎంజైములు ఉంటాయి. కొబ్బరినూనె, కరివేపాకు కూడా జుట్టుకు మేలు చేస్తుంది. దీన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. దీన్ని వెంట్రుకలకు అప్లై చేయడం వల్ల స్కాల్ప్‌లోని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తొలగిపోతుంది. చుండ్రు సమస్య ఉండదు.
We’re now on WhatsApp. Click to Join.