Ice Apple : ఇప్పుడు వేసవిలో మనకు ఎక్కువగా దొరికే వాటిలో తాటిముంజలు ఒకటి. తాటిముంజలు తినడం వలన మనం డీ హైడ్రేషన్ కి గురవకుండా ఉంటాము. వీటిని తినడం వలన కాల్షియం, విటమిన్ బి అందుతాయి. ఎండాకాలంలో తాటి ముంజలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇవి అందరూ డైరెక్ట్ గానే తింటారు.
అయితే తాటిముంజలతో హల్వా, జ్యూస్ కూడా చేసుకోవచ్చు.
తాటిముంజల హల్వా తయారీ కి కావలసిన పదార్థాలు:-
* ఒక కప్పు గోధుమపిండి (వేయించింది)
* రెండు కప్పుల పాలు
* బాదం 4
* జీడిపప్పు 4
* యాలకుల పొడి
* నెయ్యి కొద్దిగా
* తాటిముంజల గుజ్జు రెండు కప్పులు
తయారీ విధానం..
ఒక చిన్న మూకుడు తీసుకొని దానిలో పాలు పోసి మరిగించాలి. బాగా మరిగిన తరువాత దానిలో గోధుమపిండి వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. తరువాత తాటిముంజల గుజ్జు వేయాలి అది దగ్గర పడే వరకు కలబెట్టాలి. వేరొక గిన్నెలో నెయ్యి వేసి బాదం పప్పులు, జీడి పప్పును దోరగా వేయించాలి. వాటిని యాలకుల పొడిని మనం తయారుచేసుకున్న తాటి ముంజల మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ కు నెయ్యి రాసి దాని పైన వేయాలి. అది చల్లారిన తరువాత దానిని ముక్కలుగా కోసుకొని తినవచ్చు. అంతే తాటిముంజల హల్వా రెడీ అయినట్లే.
తాటిముంజల జ్యూస్ తయారీకి కావాల్సిన పదార్థాలు..
* రెండు కప్పుల తాటిముంజల గుజ్జు
*ఒక కప్పు పాలు
* రెండు స్పూన్ల విప్పింగ్ క్రీమ్
* అర కప్పు పాల పొడి
* తగినంత పంచదార
*కొద్దిగా తేనె
పాలను మరగబెట్టి ఉంచుకోవాలి. అవి చల్లారిన తరువాత దానిలో తాటిముంజల గుజ్జు, పాల పొడి, విప్పింగ్ క్రీమ్, పంచదార వేసి బాగా కలబెట్టాలి. తరువాత దానిని ఫ్రిజ్ లో పెట్టి కాస్త గట్టి పడనివ్వాలి. అవి గట్టి పడిన తరువాత దానిని ఫ్రిజ్ లో నుండి బయటకు తీసి దానిలో కొద్దిగా నీళ్ళు, తేనె కలిపి మిక్సీ పట్టాలి. అంతే తాటిముంజల జ్యూస్ రెడీ అయినట్లే.. సమ్మర్ లో దొరికే తాటి ముంజలతో ఇలా వెరైటీగా తయారుచేసి చూడండి.