Hair Tips: నూనెలో ఇవి వేసి జుట్టుకు అప్లై చేస్తే చాలు..జుట్టు ఒట్టుగా పెరగాల్సిందే?

  • Written By:
  • Publish Date - March 30, 2024 / 05:43 PM IST

మాములుగా అమ్మాయిలు పొడవాటి జుట్టు కావాలని కొరుకుంటూ ఉంటారు. అందుకోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఎటువంటి ఖర్చు లేకుండా మీ జుట్టును పెంచుకోవాలని అనుకుంటూ ఉంటారు. మరి మీరు కూడా అలా పొదవాటి జుట్టు కోసం ప్రయత్నిస్తున్నారా అయితే ఇలా చేయాల్సిందే.. కరివేపాకు, మందార ఆకులు, వేప ఆకులతో కలిపిన నూనెను వాడితే అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. వీటికి గోరింటాకు ఆకులను కూడా కలిపితే జుట్టు బాగా పెరుగుతుంది. అయితే ఇవి సహజ పద్ధతిలో జుట్టును పెంచుతాయి కాబట్టి వెంటనే ప్రయోజనాలు కనపడవు.

కొద్ది రోజులు పడితే ఫలితాలను మీరే చూడవచ్చు. అలాగే పార్లర్ లో ఉండే చికిత్సలకు దూరంగా ఉండటం మంచిది. వాటిల్లో కెమికల్స్ ఉంటాయి. కరివేపాకును మెత్తగా రుబ్బి పేస్ట్ లా చేయాలి. దాన్ని కొబ్బరినూనెలో వేసి మరిగించాలి. దాన్ని చల్లబరిచిన తర్వాత తలకు పట్టించాలి. నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఒక గంటసేపు అలా వదిలేసి తర్వాత తేలికపాటి షాంపూతో స్నానం చేయాలి. కరివేపాకుతో హెయిర్ మాస్క్ చేసుకోవచ్చు. దీనివల్ల కూడా జుట్టు పెరుగుతుంది. మందార ఆకులను పేస్ట్ లా చేసి జుట్టుకు పట్టించాలి. దీనివల్ల వెంట్రుకలు మృదువుగా మారతాయి. మందార ఆకులను గోరింట ఆకులతో కలిపి రుబ్బుకోవాలి. వాటికి వేప ఆకులను కూడా జోడించాలి.

తలలో దురదను దగ్గిస్తుంది. ఈ పేస్ట్ లో పెరుగు కూడా కలుపుకోవచ్చు. తలపై ఈ పేస్ట్ ను పూర్తిగా పట్టించి గంటసేపు అలా వదిలేయాలి. అనంతరం తలస్నానం తర్వాత జుట్టు ఆరిపోవడానికి ఎటువంటివి వాడొద్దు. తడి జుట్టు దానంతటదే ఆరిపోనివ్వాలి. హెయిర్ డ్రయ్యర్ ను అసలు వాడొద్దు. జుట్టు ఆరిపోయిన తర్వాత కావాలంటే నూనె రాసుకోవచ్చు.