Sarees : చీరలు ఎక్కువకాలం కొత్తగా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?

ఎక్కువకాలం చీరలు కొత్తగా ఉండాలంటే కొన్ని పద్ధతులని పాటించాల్సిందే.

  • Written By:
  • Publish Date - February 3, 2024 / 08:00 PM IST

చీరలు(Sarees) అంటే ఆడవాళ్ళకి(Ladies) ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. చీరలో ఆడవాళ్లు ఎంతో అందంగా ఉంటారు. ఇక ఆడవాళ్లు ఎక్కువగా చీరలను కొనుక్కుంటారు. అయితే ఎక్కువకాలం చీరలు కొత్తగా ఉండాలంటే కొన్ని పద్ధతులని పాటించాల్సిందే.

#చీరలను ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. చీరలను మడతపెట్టి ఉంచితే ముడతలు పడతాయి. కాబట్టి చీరలు మడతలు తీసి మళ్ళీ మడతబెట్టాలి.
#చీరలను వెలుతురు, దుమ్ము పడని ప్రదేశంలో దాయాలి. ఎలాగో అందరూ బీరువాల్లోనే పెడతారు.
#చీరలను ఉతికేటప్పుడు జాగ్రత్తగా ఉతకాలి. వాషింగ్ మెషిన్ లో ఉతికే వాటిని వాషింగ్ మెషిన్ లో, విడిగా ఉతికేవాటిని విడిగా, డ్రైక్లీనింగ్ చేసేవాటిని అలాగే ఉతకాలి. చీరలను కొనేటప్పుడే వాటిని ఎలా ఉతకాలో తెలుసుకొని ఉతకాలి. అప్పుడే ఎక్కువ రోజులు చీరలు పాడవకుండా ఉంటాయి.
#చీరల పైన ఏమైనా మరకలు పడితే వాటిని విడిగా ఉతకాలి. అంతే కానీ అన్నిటితో పాటు ఉతకకూడదు. మొదట మరకలు అయిన చోట నీటితో క్లీన్ చేసి సబ్బు, నిమ్మరసం లేదా వెనిగర్ వేసి ఉతకాలి. ఇలా చేయడం వలన మరకలు తొందరగా పోతాయి.
#చీరలు ఐరన్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటాయి. అయితే సిల్క్, పట్టు, వర్క్ ఉన్న చీరలు ఐరన్ చేసేటప్పుడు వాటి పైన ఒక కాటన్ క్లోత్ వేసి ఐరన్ చేస్తే ఎంతో మంచిది. ఇలా చేయడం వలన చీర పాడవకుండా లుకింగ్ గా ఉంటుంది.
#మన దగ్గర ఉండే చీరలలో కొన్ని హెవీ వర్క్ గా ఉంటాయి. కొన్ని మామూలుగా ఉంటాయి. అన్నింటిని ఒకే చోట కాకుండా విడివిడిగా ఉంచుకోవాలి. లేకపోతే వీటి వర్క్ వేరే చీరలకు తట్టి చిక్కులు పడుతుంటాయి. కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ విధంగా చీరలను జాగ్రత్తగా చూసుకుంటే ఎక్కువకాలం కొత్తగా ఉంటాయి. ఎక్కువ కాలం మన్నుతాయి.

 

Also Read : Fatigue : త్వరగా అలిసిపోతున్నారా? ఈ పదార్థాలు తినండి..