Healthy Hair: జుట్టుకి ఎటువంటి నూనె వాడితో మంచిదో తెలుసా?

మామూలుగా చాలామంది తలకు జుట్టు పట్టించాలి అన్నప్పుడు ఏ నూనె వాడితే మంచిది అనే విషయం గురించి తెగ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొందరు జుట్టుకు అసలు నూ

Published By: HashtagU Telugu Desk
Healthy Hair

Healthy Hair

మామూలుగా చాలామంది తలకు జుట్టు పట్టించాలి అన్నప్పుడు ఏ నూనె వాడితే మంచిది అనే విషయం గురించి తెగ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొందరు జుట్టుకు అసలు నూనె పెట్టాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ జుట్టుకి నూనె వాడాలి అంటే ఎటువంటి నూనెను వాడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ ఆయిల్స్ ని వాడడం వల్ల హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. రోజుకు వంద నుండి నూట యాభై వెంట్రుకలు రాలిపోవడమన్నది కామన్. దాన్ని చూసి చాలామంది తెగ కంగారు పడుతూ ఉంటారు.

అలా జుట్టు రాలిపోయినప్పుడు కంగారు పడకండి. అలాగే ఎప్పుడు కూడా జుట్టు తడిగా ఉన్నప్పుడు అస్సలు దువ్వకూడద. ఒకవేళ జుట్టు దువ్వు కోవాలి అంటే వెడల్పాటి పళ్ళున్న దువ్వెన తీసుకుని పై నుండి కిందకి వీలైనంత నెమ్మదిగా మృదువుగా దువ్వాలి. ఆరు నుండి ఎనిమిది వారాలకి ఒకసారి హెయిర్ ట్రిమ్ చేసుకోవాలి. మీ జుట్టులో 1/4 అంగుళం జుట్టు కట్ చేస్తే స్ప్లిట్ ఎండ్స్ పెరగకుండా ఉంటాయి. ప్రతి రోజూ తల స్నానం చేయకూడదు. చేసినప్పుడు జుట్టు చివరలకి కండిషనర్ అప్లై చేయండి. ఒకే బ్రాండ్ షాంపూ, కండిషనర్ యూజ్ చేయడం మంచిది.కండిషనర్ ని చల్లని నీటితో వాష్ చేయండి. అప్పుడే జుట్టుకి షైనింగ్, స్ట్రెంత్ వస్తాయి.

హెయిర్ వాష్ చేసినప్పుడల్లా కండిషన్ చేసినా కూడా అప్పుడప్పుడు డీప్ కండిషనింగ్ చేయడం మంచిది. జుట్టుకి నూనె పెట్టడం వల్ల మినరల్స్, విటమిన్స్, ఎస్సెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ మీ హెయిర్ కి అందుతాయి. ఈ విషయంలో ఎక్కువ ఓట్లు కొబ్బరి నూనె పడతాయి. కొబ్బరి నూనెలో కరివేపాకు కలిపి బాయిల్ చేసి చల్లార్చి యూజ్ చేయవచ్చు. అలాగే, మందారపూలు కూడా కలిపి ఇలాగే చేయవచ్చు. అందుకే ప్రతి పది మందిలో ఎనిమిది మంది కొబ్బరి నూనెను ఉపయోగిస్తున్నారు.

  Last Updated: 21 Jul 2023, 07:01 PM IST