Relationship : దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరగాలంటే.. ఒకరికొకరు..

ఈ రోజుల్లో భార్యాభర్తలు(Wife & Husband) ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకునే సమయం తక్కువగా ఉంటుంది.

  • Written By:
  • Publish Date - May 24, 2023 / 08:00 PM IST

ఈ రోజుల్లో భార్యాభర్తలు(Wife & Husband) ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకునే సమయం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఇరువురూ తమ ఇష్టాలను అయిష్టాలను ఒకరికి ఒకరు చెప్పుకోవాలి. లేదంటే ఈలోపు ఒకరి మీద ఇంకొకరికి ఏదో ఒక విషయంలో కోపం, అసహనం వంటివి వస్తాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే కొత్తగా పెళ్లైన వారు తమ అభిరుచుల గురించి ముందుగా ఇద్దరూ చర్చించుకోవాలి అది వంటకాలైనా లేదా ఏమైనా పనులైనా సరే వాటి గురించి తెలుసుకోవాలి.

ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నాక మీరు ఎప్పుడు కలిసి బయటకు వెళ్ళాలి లేదా ఎప్పుడు ఫ్రెండ్స్ తో ఉండాలి అన్న విషయాలు కూడా తెలుసుకోవాలి. వీకెండ్ ప్లాన్స్, ట్రిప్స్, మూవీస్, హోటల్స్, షాపింగ్స్ కి ఎప్పుడెప్పుడు వెళ్ళాలి నెలకు ఒకసారి లేదా రెండు సార్లు అనేది మాట్లాడుకోవాలి. అదేవిధంగా మీరు అనుకున్నట్లుగానే వాటిని పాటించాలి అప్పుడే మీ ఇద్దరి మధ్య నమ్మకం, ఎటువంటి గొడవలు రాకుండా ఉంటాయి. అన్ని విషయాలను మనసు విప్పి మాట్లాడుకోవాలి, అడగాలి.

ఏదో ఒక సమయంలో ఒక తప్పు జరిగితే దాని కోసం ప్రతి సారి అవతలి వారిని నిందించకూడదు. తప్పులు అందరం చేస్తూ ఉంటాము కాబట్టి మళ్ళీ రిపీట్ అవ్వదు అని సర్దిచెప్పండి. కష్టసుఖాలు ఆఫీస్ వి అయినా ఇంటివి అయినా ఇద్దరూ చెప్పుకుంటూ ఉంటే వారి దాంపత్యం ఎప్పుడూ బాగుంటుంది. ఇద్దరూ జాబ్స్ చేసే వారు అయితే పనిని కూడా ఇద్దరూ షేర్ చేసుకోవడం వలన ఇద్దరికీ ఒకరంటే ఒకరికి గౌరవం పెరుగుతుంది. ఈ విధంగా భార్యాభర్తలు ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకొని మీ మధ్య సాన్నిహిత్యం పెంచుకుంటే మీ దాంపత్యం ఎప్పటికీ చెక్కుచెదరదు. ఇంకా మీరు స్నేహితులుగా కూడా ఉంటూ ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు.

 

Also Read : Spirituality: భోజనం బాగోలేదు అని తిట్టుకుంటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?