మన ఇంట్లో చెడు వాసనను పోగొట్టడానికి లేదా రూమ్ సువాసన భరితంగా ఉండడానికి రూమ్ ఫ్రెష్నర్లు(Room Freshener) వాడుతుంటాము. కానీ వాటి వలన మనం అనారోగ్యానికి గురవుతాము. ఇంకా అవి కొంచెం ఖరీదుగా కూడా ఉంటాయి. మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతోనే రూమ్ ఫ్రెష్నర్లు(Air Freshener) తయారుచేసుకోవచ్చు. అవి ఎంతో సువాసనను ఇంటి నిండా వ్యాపిస్తాయి మరియు తక్కువ ఖర్చుతో అయిపోతుంది.
బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, నిమ్మతొనలు ఒక గిన్నెలో వేసుకొని ఉంచాలి. దీని వలన మన ఇంటిలో మంచి వాసన వస్తుంది. నాలుగు గంటలు ఈ వాసన వస్తుంది. మన ఇంటిలో నిమ్మ తొనలు లేకపోతే దాని బదులు కమల తొక్కలు లేదా తొనలు కూడా పెట్టవచ్చు. మనకు వంటింటిలో అన్ని రకాల వాసనలు వస్తుంటాయి అయితే వంటింట్లో సువాసనభరితంగా ఉండడానికి మనం ఒక గిన్నెలో నీళ్ళు పోసి దానిలో బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, యాలకులు వేసి పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టాలి. అప్పుడు ఆ రూమ్ అంతా మంచి సువాసన వస్తుంది.
ఒక కప్పు నీటిలో రెండు స్పూన్ల ఆల్కహాల్ ని వేయాలి. దానిలో కొబ్బరి నూనె, వంట నూనె లేదా ఆలివ్ నూనె ఏదయినా పది చుక్కలు వేయాలి. అప్పుడు అది రూమ్ ఫ్రెష్నర్ గా పని చేస్తుంది. ఒక చిన్న కార్డుబోర్డులో కొద్దిగా తినే సోడా, కొన్ని నూనె చుక్కలు వేయాలి ఆ కార్డు బోర్డు కి ఒక రంద్రం పెట్టాలి. దానిని బాత్రూమ్ లో లేదా రూమ్ లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దీని వలన రూమ్ అంత సువాసన వస్తుంది. దాల్చిన చెక్క, నాలుగు లవంగాలు, నాలుగు కర్పూరం బిళ్ళలు మెత్తగా పొడి చేయాలి దానిలో నూనె లేదా నీళ్ళు పోసి ద్రవం లాగా తయారుచేయాలి దీనిని ఆల్ అవుట్ ఖాళీ డబ్బాలో వేసి స్విచ్ ఆన్ చేస్తే రూమ్ అంతా మంచి సువాసన వస్తుంది. ఈ విధంగా మనం మన ఇంటిలోనే రూమ్ ఫ్రెషనర్లు తయారుచేసుకోవచ్చు.
Also Read : Sleeping With Socks: కాళ్లకు సాక్స్ ధరించి నిద్రపోతున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవు..!