అధిక బరువు వల్ల మనం వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన కూడా పడాల్సి వస్తుంది. గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణం అధిక బరువే అని చెప్పవచ్చు. కనుక అధిక బరువు సమస్య నుండి వీలైనంత త్వరగా బయటపడడం చాలా అవసరం. ఇలాంటి వారు ఇంటర్మీటెంట్ పాస్టింగ్ పద్దతిని పాటించడం వల్ల చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ పద్దతిలో రోజుకు రెండు సార్లు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్లనే వారు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎంతో కాలం జీవించారు. ఈ పద్దతినే మనం ఇప్పుడు ఆచరించాలి. ఈ ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ లో రోజుకు రెండు సార్లు ఆహారాన్ని తీసుకుని 16 గంటలు ఎటువంటి ఘన పదార్థాలను తీసుకోకుండా ఉండాలి.
ఉదయం 10 గంటలకు ఏదైనా ఒక వెజిటేబుల్ జ్యూస్ ను తీసుకోవాలి. ఇలా తీసుకున్న గంట తరువాత రెండు లేదా మూడు పుల్కాలను కూరలతో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తరువాత మరలా సాయంత్రం 4 గంటలకు ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ ను తీసుకోవాలి. అలాగే 5 గంటలకు మొలకెత్తిన విత్తనాలను తీసుకోవాలి. తరువాత 7 గంటల లోపు వివిధ రకాల పండ్లను తీసుకోవాలి. మరింత శక్తి కావాలనుకునే వారు పచ్చి కొబ్బరిని, నానబెట్టిన పల్లీలను, డ్రై ఫ్రూట్స్ ను కూడా తీసుకోవచ్చు.
సాయంత్రం 7 గంటల లోపు ఈ విధంగా ఆహారాన్ని తీసుకున్న తరువాత మరలా ఉదయం 11 గంటల వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఈవిధంగా ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ ను పాటించడం వల్ల రెండు నెలల్లోనే మనం 5 నుండి 10 కిలోల వరకు బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పద్దతిని పాటించడం వల్ల అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.
Also Read: Jagan on Pawan: నలుగురిని పెళ్లి చేసుకుని.. నాలుగేళ్లకోసారి భార్యలను మార్చుకోలేం: పవన్ పై జగన్ ఫైర్!